ఇంట్లో నుంచి బయటకు వెల్తున్నానని చెప్పిన మహిళ.. ఆ తరువాత తనకు బతకాలని లేదంటూ భర్తకు మెసేజ్ చేసింది. భర్త మెసేజ్ చూసుకుని షాక్ అయి ఆమెను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసేలోపే అదృశ్యమయ్యింది. ఈ షాకింగ్ ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లిలో నివాసముండే రాజ్ కుమార్ ఓ చర్చ్ పాస్టర్. గురువారం ఇతడి భార్య కిశోరి (66) ఇంటినుంచి బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. 

మద్యాహ్నం తరువాత నాకు బతకాలని లేదంటూ ఫోన్ ద్వారా మెసేజ్ చేసింది. మెసేజ్ చేసిన తరువాత కొత సమయానికి.. అంటే సుమారు 3 గంటల ప్రాంతంలో ఆమె భర్త మెసేజ్ చూసుకున్నాడు. వెంటనే ఆందోళనలో ఫోన్ చేయగా ఫోన్ స్విచాఫ్ వచ్చింది. 

వెంటనే ఆటోలో వెళ్లిన డ్రైవర్ ను విచారించగా ఆమె సచివాలయం గేట్ నెం.1 వద్ద దింపినట్లు తెలుపడంతో భర్త గురువారం రాత్రి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.