Asianet News TeluguAsianet News Telugu

భర్త హత్య కేసులో ట్విస్ట్: రెండో భార్య కారణంగానే...

 రెండో పెళ్లి చేసుకొని  భార్య, పిల్లలతో  సుఖంగా జీవిస్తున్న  భర్తను  ఉద్యోగం, భీమా డబ్బుల కోసం  భార్యే హత్య చేయించింది. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. 

Woman kills hubby for job, insurance money
Author
Hyderabad, First Published Sep 4, 2018, 10:49 AM IST


హైదరాబాద్:  రెండో పెళ్లి చేసుకొని  భార్య, పిల్లలతో  సుఖంగా జీవిస్తున్న  భర్తను  ఉద్యోగం, భీమా డబ్బుల కోసం  భార్యే హత్య చేయించింది. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే మృతదేహంపై ఉన్న  గాయాల ఆధారంగా  రోడ్డు ప్రమాదంగా  చిత్రీకరించేందుకు  చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు   నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్ నగరంలోని  వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదాన్ని  పోలీసులు హత్యగా తేల్చారు.  తపాలాశాఖ ఉద్యోగి కేశ్యనాయక్ మరణం వెనుక  దాగి ఉన్న రహస్యాన్ని పోలీసులు చేధించారు. 

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కమ్మగూడలోని భవానీనగర్‌ కాలనీకి చెందిన కేశ్యా నాయక్‌తో నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని బొర్రయపాలెంకు చెందిన కేతవత్‌ పద్మకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే తనను వేధిస్తున్నాడని  భార్య పద్మ  అతడితో విడిపోయింది  అంతేకాదు  ఎనిమిదేళ్ల క్రితం పోలీసులకు పద్మ ఫిర్యాదు చేసింది. ఈ కేసు కోర్టులో నడుస్తోంది.

ఈ క్రమంలోనే కేశ్యనాయక్ మరో వైపు  శైలజ అనే యువతిని రెండో వివాహం చేసుకొన్నాడు.  ఇద్దరు పిల్లలతో  జీవితాన్ని సాగించడం పట్ల పద్మ జీర్ణించుకోలేకపోయింది. కేశ్యనాయక్ వద్ద  డ్రైవర్ గా పనిచేసే వినోద్ తో పద్మ పరిచయం పెంచుకొంది.  కోర్టు వాయిదాల సమయంలో  కోర్టుకు కేశ్యనాయక్ తో వచ్చే వినోద్ తో ఆమె పరిచయం పెంచుకొంది. 

ఇన్సూరెన్స్ డబ్బులు రూ. 60 లక్షలు వస్తాయని , ఇందులో రూ. 10 లక్షలు చెల్లించనున్నట్టు డ్రైవర్ వినోద్ ను నమ్మించింది. కేశ్యానాయక్‌కు వినోద్  సెప్టెంబర్ 1వ తేదీన ఫోన్ చేశాడు.  టీఎస్‌07యూఈ 2221 నంబర్‌ గల కారులో గుర్రంగుడ దగ్గర ఉన్న ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు తీసుకెళ్లి కేస్యా నాయక్‌కు మోతాదుకు మించి మందు తాగించాడు.

గుర్రంగూడ నుండి ఇంజాపూర్ కు వెళ్లే మార్గంలో కారు ఆపి కేశ్యనాయక్ గొంతు నులిపి చంపేశాడు.  ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు  ఇంజాపూర్ కమాన్ దగ్గర ఉన్న  హైటెన్షన్ విద్యుత్ పోల్ కు కారును ఎడమవైపుకు మాత్రమే ఢీకొట్టి వెళ్లిపోయాడు.  అయితే తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

మృతదేహంపై ఉన్న గాయాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తే  అసలు విషయం వెలుగు చూసింది. కేశ్యనాయక్ తో పాటు  వినోద్ ను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ వార్తలు చదవండి

దారుణం: భర్తను కారులోనే డ్రైవర్ తో చంపించిన భార్య, ఎందుకంటే..

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...
 

Follow Us:
Download App:
  • android
  • ios