హైదరాబాద్: కట్టుకొన్న భర్తను కిరాయి హంతకులతో  ఓ భార్య దారుణంగా హత్య చేయించింది. భర్తను హత్య చేయించి.... ఈ ఘటనను  సాదారణ మరణంగా చిత్రీకరించే యత్నం చేసింది.  అయితే  ఎట్టకేలకు ఈ విషయం తెలిసి భార్య పద్మతో పాటు వినోద్ అనే వ్యక్తిని వనస్థలిపురం పోలీసులు  సోమవారం నాడు అరెస్ట్  చేశారు.

హైద్రాబాద్ వవనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకొంది.  తన భర్త  చేసే ఉద్యోగం తో పాటు ,భర్త పేరున ఉన్న ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పద్మ దారుణానికి పాల్పడింది.

నల్గొండ జిల్లా  మిర్యాలగూడ కు చెందిన కేశ్యనాయక్, పద్మ దంపతులు హైద్రాబాద్ లో స్థిరపడ్డారు.కేశ్యనాయక్ ప్రభుత్యోద్యోగి. కేశ్యనాయక్  వద్ద వినోద్ కారు డ్రైవర్ గా పనిచేసేవాడు.అయితే వినోద్ తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త అడ్డు తొలగించుకొంటే ఉద్యోగంతో పాటు ఇన్సూరెన్స్ డబ్బులు... ప్రియుడు తనకు దక్కుతాడని ఆమె భావించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.

రెండు రోజుల క్రితం గుర్రంగూడ సమీపంలో కారులోనే కేశ్యనాయక్ ను పద్మ, వినోద్ హత్య చేశారు. ఆ తర్వాత కారును ఎలక్ట్రిక్ పోల్ కు ఢీకొట్టారు. కారు ప్రమాదంలో కేశ్యనాయక్ మృతి చెందినట్టుగా నమ్మించేందుకు ప్రయత్నించారు.

 ఈ విషయమై నిందితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ కేసు విచారణ చేసిన పోలీసులకు పద్మపై అనుమానం కలిగింది. ఆమెను విచారిస్తే అసలు విషయాన్ని ఒప్పుకొంది. కారులోనే భర్తను  ఊపిరాడకుండా హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్టు చెప్పింది. .మృతదేహంపై ఉన్న గాయాల ఆధారంగా విచారణ జరిపిన పోలీసులకు ఈ విషయం తెలిసింది. పద్మతో పాటు వినోద్‌ను కూడ  పోలీసులు అరెస్ట్  చేశారు. 

 

ఈ వార్తలు చదవండి

ప్రియురాలితో రాసలీలలు: సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో, బాధితులిలా..

నపుంసకుడు, నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్: టెక్కీపై భార్య ఆరోపణలు
ఆ అవసరం లేదు: భార్య ఆరోపణలపై టెక్కీ

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్