కర్ణాటక రాష్ట్రానికి  చెందిన ఓ మహిళ తెలంగాణలో ఆత్మహత్యకు పాల్పడింది. భర్తతో జరిగిన గొడవ కారణంనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

కర్ణాటక రాష్ట్రానికి  చెందిన  భార్యభర్తలు.. తెలంగాణ రాష్ట్రంలో ని కరీంనగర్ జిల్లాలో స్థిరపడ్డారు. వారు అక్కడ బేకరీ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా.. అనుకోకుండా.. భార్య ఇంట్లో బలవనర్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆమె చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకోవడం గమనార్హం.

కాగా.. భర్తతో ఉదయం ఓ విషయంలో గొడవ జరగడంతో ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. భర్త బేకరీకి వెళ్లగానే ఆమె బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. తన చావుకి ఎవరూ కారణం కాదంటూ ఆమె సెల్ఫీ వీడియోలో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.