కరోనా సోకి మహిళ మృతి.. ఆమె భర్తకు పాజిటివ్
Also Read అదీ విశ్వాసం అంటే.. ప్రాణాలు దారపోసి యజమానిని కాపాడి.....
పూర్తి వివరాల్లోకి వెళితే...చేగూర్‌లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. గతంలో బాధితుడి భార్య కరోనాతో మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ భర్తకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే అతడిని ఫీవర్ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో చేగూర్ గ్రామంలో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరింది.
ఇదిలా ఉండగా... రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడం, వైరస్ విస్తరిస్తుండడంతో ప్రభుత్వం హుటాహుటిన అప్రమత్తమై, తెలంగాణలో 100 మేర హాట్ స్పాట్లను అదనంగా చేర్చింది. శనివారం నాటికి 101 హాట్ స్పాట్లను ప్రభుత్వం గుర్తించగా, ఇప్పుడు ఆ సంఖ్య 202కు తెలంగాణ ప్రభుత్వం పెంచింది.
ఇకపోతే, తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా తాజాగా ఇద్దరు మరణించారు. ఈ ఇద్దరితో కలుపుకొని ఇప్పటివరకు మొత్తం 16 మంది మరణించినట్టు అయింది. మరణాలు ఇలా ఉండగా, మరోవైపు తెలంగాణలో కరోనా మహమ్మారి బారినుంచి కోలుకొని బయటపడుతున్నవారి సంఖ్య కూడా ఆశాజనకంగా ఉంది.
ఏడుగురికి నిన్న కరోనా నెగటివ్ రిజల్ట్స్ రావడంతో వారు పూర్తిగా కోలుకున్నారు అని ధృవీకరించుకున్న తరువాత డిశ్చార్జ్ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
నిన్నొక్కరోజే తెలంగాణలో 28 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్యా 532కి చేరింది.
ప్రస్థులంతా ఆక్టివ్ కేసులు 412 గా ఉండగా ఇప్పటివరకు 103 మందిని డిశ్చార్జ్ చేసారు. నిన్నటి రెండు మరణాలతో కలుపుకొని తెలంగాణాలో మరణాల సంఖ్య 16కు చేరుకుంది.
ఇకపోతే, గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 909 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన 24 గంటల్లో 34 మంది మరణించినట్లు తెలిపారు. మొత్తం కేసుల సంఖ్య 8,356కి చేరగా, మరణాల సంఖ్య 273కి చేరిందని లవ్ అగర్వాల్ వెల్లడించారు.