అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో ఓ మహిళ నడి రోడ్డుపైనే శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన మల్లాపూర్ డివిజన్ ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఫిర్జాదీ బేగం సోమవారం రాత్రి 8గంటల సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతుండగా 108 కి సమాచారం అందించారు.

కాగా... అంబులెన్స్ కోసం చాలాసేపు ఎదురు చూశారు. అయినా అంబులెన్స్ రాలేదు. ఈ క్రమంలో నొప్పులు తీవ్రతరం కావడంతో మహిళ నడి రోడ్డుపైనే ప్రసవించింది. మహిళ బిడ్డను ప్రసవించిన పదిహేను నిమిషాలకు అంబులెన్స్ రావడం గమనార్హం. తర్వాత అంబులెన్స్ లో కోఠి ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా.. రాజేంద్ర నగర్ కి చెందిన సమీనా బేగం(30) అనే మహిళ అంబులెన్స్ లోనే బిడ్డను ప్రసవించింది. సోమవారం ఉదయం పురిటినొప్పులు రావడంతో.. 108కి సమాచారం అందించారు. వెంటనే అంబులెన్స్ రాగా.. ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆమె బిడ్కుజన్మనివ్వడం గమనార్హం.

కాగా.. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ప్రసవానంతరం ఆస్పత్రిలో వారికి చికిత్స అందించారు.