Asianet News TeluguAsianet News Telugu

కొంప ముంచిన డేటింగ్ యాప్.. రూ.11లక్షలు కాజేసిన యువతి

కిశోర్ దగ్గర డబ్బులు కాజేయాలని అప్పటికే అఖిల ప్లాన్ వేసింది. దానిలో భాగంగానే.. అతడితో ఫోన్‌లో ‘గూగుల్‌ ప్లే సర్వీసెస్‌’  యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించింది. దానిని యాక్సస్‌ చేయడానికి అనువైన నంబర్‌ను అతడి నుంచే తీసుకుని తన ఫోన్‌ ద్వారా లింకు ఏర్పాటు చేసుకుంది. 

woman cheat youth for money in dating app
Author
Hyderabad, First Published Jun 19, 2020, 8:37 AM IST

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. యువతుల చేతిలో అతి దారుణంగా మోసపోయి పోలీసులను ఆశ్రయిస్తున్న యువకులు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యారు. కేవలం డేటింగ్ యాప్స్ లో యువతులను పరిచయం చేసుకొని.. దాని ద్వారా వారు చెప్పిన దానికి తలూపడంతో.. చివరకు లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల నగరానికి చెందిన ఓ యువకుడు దాదాపు రూ.11లక్షలు పొగొట్టుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో  చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా, గిద్దలూరుకు చెందిన కిషోర్‌ ప్రస్తుతం ఎస్సార్‌నగర్‌లో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారు. అతడి తండ్రి స్వస్థలంలోనే ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం పదవీ విమరణ చేసిన ఆయనకు రూ.15 లక్షలు బెనిఫిట్స్‌ అందాయి. వీటిని స్థానిక ఎస్బీఐ బ్రాంచ్‌లో కుమారుడు కిషోర్‌ పేరుతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాడు. ఈ ఖాతాకు సంబంధించిన యూనో యాప్‌ను కిషోర్‌ తన స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని లావాదేవీలు జరిపేవాడు.

కొన్నాళ్ల క్రితం ఇతడికి ఓ డేటింగ్‌ యాప్‌ ద్వారా అఖిల అని చెప్పుకున్న యువతి పరిచయం అయింది. వాట్సాప్, ఐఎంఒ యాప్స్‌ ద్వారా చాటింగ్, ఫోన్‌ కాల్స్‌ వీరిద్దరి మధ్యా సాగాయి. కిశోర్ దగ్గర డబ్బులు కాజేయాలని అప్పటికే అఖిల ప్లాన్ వేసింది. దానిలో భాగంగానే.. అతడితో ఫోన్‌లో ‘గూగుల్‌ ప్లే సర్వీసెస్‌’  యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించింది. దానిని యాక్సస్‌ చేయడానికి అనువైన నంబర్‌ను అతడి నుంచే తీసుకుని తన ఫోన్‌ ద్వారా లింకు ఏర్పాటు చేసుకుంది. 

టీమ్‌ వ్యూవర్‌ తరహాకు చెందిన ఆ యాప్‌ ద్వారా అఖిల తన ఫోన్‌ నుంచే కిఫోర్‌ ఫోన్‌ను, అందులోని యాప్స్‌ను యాక్సస్‌ చేయవచ్చు. కొన్ని రోజుల తర్వాత తనకు కొంత డబ్బు అవసరం ఉందని, కావాల్సినప్పుడు అడిగితే సహాయం చేయాలని కోరడంతో కిషోర్‌ అందుకు అంగీకరించాడు. ఈ నెపంతో తనను యూనో యాప్‌లో బెనిఫిషియరీగా జోడించేలా చేసింది. ఎప్పటి లాగానే వీరిద్దరూ బుధవారం ఉదయం చాలాసేపు చాటింగ్‌ చేసుకున్నారు.

ఆ తర్వాత కిషోర్‌ తన ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి బయటికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన సదరు అఖిల సదరు యాప్‌ ద్వారా కిషోర్‌ ఫోన్‌ను యాక్సస్‌ చేసింది. యూనో యాప్‌ ద్వారా గిద్దలూరులోని బ్యాంకు ఖాతాలో ఉన్న ఫిక్సిడ్‌ డిపాజిట్లు రద్దు చేసి ఆ మొత్తం నుంచి రూ.11.3 లక్షలు దఫదఫాలుగా బెంగళూరులో మహేశ్వర్‌ పేరుతో ఉన్న ఖాతాల్లోకి నిఫ్ట్, ఆర్టీజీఎస్‌ ద్వారా మళ్లించింది. ఆపై యూనో సహా అన్ని యాప్స్‌ డిలీట్‌ చేయడంతో పాటు ఫోన్‌ను ఫార్మాట్‌ చేసేసింది. 

తర్వాత చెక్ చేసుకున్న కిశోర్ కి అనుమానం రాగా.. వెంటనే బ్యాంక్ ఖాతాలో డబ్బు చెక్ చేసుకున్నాడు. చూస్తే రూ.15లక్షల్లో కేవలం రూ.3.7లక్షలు మాత్రమే ఉన్నాయి. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇది అతని డేటింగ్ గర్ల్ ఫ్రెండ్ చేసిన పనిగా గుర్తించారు.

Follow Us:
Download App:
  • android
  • ios