వరంగల్ జిల్లాలో ఓ మహిళను దారుణంగా మొహం మీద బండరాయితో మోది హత్య చేశారు. దీనికి కారణం కుటుంబకలహాలా.. మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ : వరంగల్ జిల్లా సంఘం మండలంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. బండరాయితో మహిళల తలపై మోది అతి దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం వరంగల్ జిల్లా సంఘం మండలంలోని వంజరపల్లిలో ఈ ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఈ మేరకు ఉన్నాయి. సంగం మండలంలోని పల్లారుగూడ రెవెన్యూ శివారు గ్రామం వంజరపల్లి. ఈ గ్రామానికి చెందిన కౌడగాని శంకర్రావు రోజు గేదెలను తోలుకొని వ్యవసాయ బావి వద్దకు వెళుతుంటాడు.
ఆ రోజు కూడా రోజూ వెళ్లినట్లే వెళుతుండగా.. గేదెలలో ఉన్న ఒక దూడ ఒకసారిగా రోడ్డు పక్కన ఏదో చూసి బెదిరింది. అది గమనించిన శంకర్రావు అటువైపుగా చూడగా… తప్పెట్ల ఎల్లయ్య అనే వ్యక్తికి చెందిన వ్యవసాయ భూమి వద్ద రక్తపుమడుగులో ఓ మహిళ మృతదేహం కనిపించింది. శంకర్రావు వెంటనే సర్పంచ్ భర్త పెంతల అనిల్ కు ఫోన్ చేసి సమాచారం తెలిపారు. సమాచారం అందుకోగానే వెంటనే అక్కడికి వచ్చి చూసిన అని పోలీసులకు ఫోన్ చేశాడు. ఈ మేరకు ఎస్ఐ భరత్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు.
మణిపూర్ నుంచి తెలుగు విద్యార్థుల తరలింపు.. శంషాబాద్‌కు చేరుకున్న తొలి ఫ్లైట్..
ఈస్ట్ జోన్ డిసిపి కరుణాకర్, మామునూరు ఏసిపి కృపాకర్, పర్వతగిరి సీఐ శ్రీనివాస్, ఇంకా మిగతా పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దింపారు. వీరు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. మృతదేహం దగ్గర పర్సు దొరికింది. అందులో రూ.5,280 నగదు, ఐదు రూపాయల కాయిన్ ఉన్నాయి. మృతదేహం పడి ఉన్న స్థలానికి కొద్ది దూరంలో రోడ్డుపై పగిలిన గాజులు ఒక కాలి చెప్పు కాలిపట్టాతో పాటు మృతురాలి వేలిముద్రలు రోడ్డుపై పడిన రక్తం మరకలను సేకరించారు.
మృతదేహంపై బండరాయితో మోదిన గాయాలు ఉన్నాయి. మృతురాలి ఎడమ పక్క కనుబొమ్మ, ముక్కు, కణత, కింది పెదవిపై బండరాయితో మోదినట్లుగా కనిపిస్తోంది.
శనివారం రాత్రి ఈ హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. రాత్రి 9 గంటల సమయంలో మృతురాలి మెడకు స్కార్ప్ తో ఉరివేసి ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు బండరాయితో మోది చంపారని.. ఆ తర్వాత రోడ్డు పక్కన పడేసి వెళ్లినట్లుగా తెలుస్తుందని పోలీసులు అంటున్నారు. మృతురాలిని జర్పుల శౌరీ (45), నల్లబెల్లి శివారు జగ్గు నాయక్ తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆమె భర్త 12 ఏళ్ల క్రితం మరణించాడని బంధువులు తెలిపారు.
ఈమెకి సురేష్, వెంకటేష్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడు సురేష్ కు వివాహమైంది. అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. పర్వతగిరి సిఐ శ్రీనివాస్ బంజరపల్లి సర్పంచ్ భర్త అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు కారణం కుటుంబ కలహాలా లేక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్ తెలిపారు.
