Asianet News TeluguAsianet News Telugu

అక్రమ సంబంధానికి వివాహిత బలి... అత్యంత దారుణంగా చంపిన ప్రియుడు

మంథని పట్టణంలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యింది. ఆమె హత్యకు అక్రమ సంబంధమే కారణంగా తెెలుస్తోంది. 

Woman brutal murder in Manthani AKP
Author
First Published Oct 11, 2023, 1:38 PM IST

పెద్దపల్లి : వివాహేతర, అక్రమ సంబంధాలు కుటుంబాలకు కుటుంబాలనే రోడ్డున పడేస్తున్నాయి. క్షణకాలం సుఖం కోసం కొందరు సుఖసంతోషాలతో సాగుతున్న నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాల కారణంగా భార్యను భర్త, భర్తను భార్య చంపుకున్న ఘటన అనేకం వెలుగుచూసాయి. ఇక పరాయి పురుషుడి మోజులో పడి కొందరు మహిళలు ప్రాణాలమీదకు తెచ్చుకుంటుకున్నారు. ఇలా పెద్దపల్లి జిల్లాలో ఓ వివాహిత ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యింది. 

పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్ష్మీపూర్ లో రాజమణి కుటుంబంతో కలిసి నివాసముంటోంది. రేషన్ డీలర్ అయిన ఈమెకు అదే గ్రామానికి చెందిన సంతోష్ తో కొంతకాలంగా అక్రమసంబంధం కొనసాగుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రాజమణిని సంతోష్ అత్యంత కిరాతకంగా గొంతుకోసి చంపాడు. ఈ దారుణ హత్య మంథనిలో కలకలం రేపింది. 

మంథని పోస్ట్ ఆఫీస్ వెనకాల ఇంట్లో రాజమణి మృతదేహం రక్తపుమడుగులో పడివుండటం స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు రాజమణి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంథని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Read More  ఆస్తి కోసం అన్నను హతమొందించి.. కన్న తల్లి, సోదరితో కలిసి హైడ్రామా..

మహిళ హత్యకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంతోష్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగమణితో అక్రమ సంబంధాన్ని కలిగివున్న సంతోష్ డబ్బుల కోసమే ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సంతోష్ పరారీలో వున్నట్లు... అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios