అత్తింటివారి వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ పిల్లలతో కలిసి పోలీస్ వాహనం ఎక్కి ఆందోళనకు దిగింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 

వేములవాడ: అత్తింటివారి వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి పోలీస్ వాహనం పై కూర్చుని ఆందోళనకు దిగింది. తనకు, తన బిడ్డలకు భర్త, అత్తామామ నుండి రక్షణ కల్పించాలని బాధిత మహిళ పోలీసులను కోరుతూ పోలీస్ స్టేషన్ వద్దే నిరసన చేపట్టింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా (rajanna siricilla district)లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... వేములవాడ (vemulawada) నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి మండలం గైదిగుట్ట తండా కు చెందిన గుగులోతు మౌనికకు ఇద్దరు సంతానం. అయితే వరకట్నం కోసం అత్తింటివారి వేధింపులను తాళలేక పోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. అత్తామామ,భర్త నుండి వరకట్న వేధింపులు (dowry harassment) లేకుండా చూసి న్యాయం చేయాలని తన పిల్లలతో కలిసి పోలీస్ వాహనం పైకి ఎక్కి నిరసన తెలిపింది. 

Video

గతంలోనూ ఇదే విషయమై భర్తతో గొడవ జరగ్గా పోలీస్టేషన్ లో పిర్యాదు చేశానని బాధిత మహిళ తెలిపింది. అయితే అంగవైకల్యంతో పుట్టిన పాపని చంపేస్తానని కూడా భర్త బెదిరిస్తున్నాడని తెలిపింది. ఇప్పటికైనా పోలీసులు తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ వేడుకుంది. 

read more వ‌ర‌క‌ట్నంపై చ‌ట్టాలే కాదు.. సామాజికంగానూ మార్పు రావాలి: సుప్రీంకోర్టు

మహిళ ఆందోళనపై ఎస్సై రాజుని వివరణ కోరగా గతంలోనే భార్యభర్తల గొడవపై కేసు నమోదు అయిందని తెలిపారు. ఇప్పుడు ఆ కేసుపై విచారణ కొనసాగుతోందని... కోర్టు ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని... ఇలా ఎవరికి వారు గొడవలు పెట్టుకోవద్దని ఎస్సై సూచించారు.