Asianet News TeluguAsianet News Telugu

వివాహిత స్నానం చేస్తున్న వీడియోలు వైరల్... ముగ్గురు నిందితుల అరెస్ట్

నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో దారుణం బైటపడింది. ఓ వివాహిత స్నానం చేస్తుండగా దొంగచాటుగా వీడియో తీసిన ఓ కామాంధుడు ఆమెను బెదిరిస్తూ గత మూడు సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అయితే ఇటీవల ఆ వీడియోలు సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ కావడంతో గమనించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం బైటపడింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడితో పాటు ఈ వీడియోను వైరల్ చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
 

Woman alleges rape, blackmail for 6 years
Author
Choutuppal, First Published Aug 25, 2018, 11:01 AM IST

నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో దారుణం బైటపడింది. ఓ వివాహిత స్నానం చేస్తుండగా దొంగచాటుగా వీడియో తీసిన ఓ కామాంధుడు ఆమెను బెదిరిస్తూ గత మూడు సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అయితే ఇటీవల ఆ వీడియోలు సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ కావడంతో గమనించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం బైటపడింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడితో పాటు ఈ వీడియోను వైరల్ చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై ఏసిపి రమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చౌటుప్పల్ మండలం పిప్పల్ పహడ్ గ్రామానికి చెందిన ఉప్పుతోట రంగయ్య(45) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ వివాహితపై కన్నేశాడు. ఆమెను పలుమార్లు లోబర్చుకోవాలని చూసినా ఆమె తిరస్కరించింది. దీంతో ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆమె తన ఇంట్లో స్నానం చేస్తుండగా రంగయ్య దొంగచాటుగా ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఆ వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ గత మూడేళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఆమెపై అత్యాచారం చేస్తూ కూడా కొన్ని వీడియోలు చిత్రీకరించాడు. 

అయితే గత కొన్ని రోజులుగా వివాహిత రంగయ్య బారి నుండి తప్పించుకుని తిరుగుతోంది. దీంతో ఆమెపై కోపంతో రగిలిపోయిన అతడు తన వద్ద పనిచేసే మహేష్(26), ప్రశాంత్(22) లకు ఈ వీడియోలు పంపించాడు. వీటిని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేయాలని సూచించాడు. దీంతో వీరు పలు వాట్సాఫ్ గ్రూపుల్లో ఈ వీడియోను సర్క్యులేట్ చేశారు. దీంతో ఈ విషయం బాధితురాలికి తెలియడంతో ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది.

బాధితురాలి పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు రంగయ్యతో పాటు మహేష్, ప్రశాంత్ లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 3 సెల్ ఫోన్లు, కంప్యూటర్, బైక్ లను స్వాదీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.  

సంబంధిత వార్తల కోసం కింది లింక్ క్లిక్ చేయండి

స్నానం చేస్తుండగా వీడియో తీసి....వివాహితపై మూడేళ్లుగా అత్యాచారం


 

Follow Us:
Download App:
  • android
  • ios