Asianet News TeluguAsianet News Telugu

దొరా... జర గీ పని కూడా జేయుండ్రి

ధర్నా చౌక్ తో పాటు కంపుకొడుతున్న హుస్సేన్ సాగర్ ను, ట్రాఫిక్ జాంలతో ఇబ్బంది పెడుతున్న అసెంబ్లీని కూడా తరలిస్తే బాగుంటది. హైదరాబాద్ వాసుల చిరకాల కోరిక కూడా నెరవేరతది.

Will the govt shifted hussainsagar and assembly to city outcuts

బంగారు తెలంగాణకు అడ్డొస్తున్న ప్రతీదాన్ని తరలించేందుకు, ఎత్తి వేసేందుకు కేసీఆర్ సర్కారు కంకణం కట్టుకున్నట్లుంది.

 

ఆ మధ్య సచివాలయాన్ని తరలించాలని నిర్ణయించిన సీఎం ప్రజాసంఘాల ఒత్తిడితో ఆ నిర్ణయాన్ని కాసేపు వాయిదా వేసుకున్నారు.

 

అయితే సెక్రటేరియట్ కు రాకుండా కోట్ల రూపాయిల ప్రజాధనంతో కొత్త ఇళ్లు కట్టుకొని అక్కడి నుంచే బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్నారు.

 

ఇంకా వాస్తు దోషం పేరుతో కూల్చివేయడాలు, ఎత్తివేయడాలు నిరాటంకంగా సాగుతూనే ఉన్నాయి.

 

ఈ మధ్యలోనే సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నవారి నోరు నొక్కేందుకు, వారి నిరసన కేంద్రాలను ఎత్తివేసేందుకు కూడా శాయాశక్తుల కృషి చేస్తున్నారు.

 

వందేళ్ల ఉస్మానియా యూనివర్సిటీ వేడుకల సందర్భంలో కూడా ఈ ఎత్తివేసే ప్రక్రియను పోలీసుల సమన్వయంతో సర్కారు చాలా చక్కగా నిర్వహించి విజయవంతమైంది.

 

ఏ ఉస్మానియా గడ్డమీద తెలంగాణ ఉద్యమం రగిలిందో అక్కడే ఒక్క విద్యార్థి గొంతు కూడా పెగలకుండా  జాగ్రత్తపడింది.

 

అంతకుముందు నిరుద్యోగ నిరసన ర్యాలీని అడ్డుకోవడంలోనూ ఖాకీలను ఉసిగొల్పి అధికార పార్టీ తన పంథం నెగ్గించుకుంది.

 

ఇక ఈ రోజు ధర్నా చౌక్ ఎత్తివేసే ప్రక్రియలోనూ అంతే దూకుడును ప్రదర్శించింది.

 

ధర్నా చౌక్ వల్ల స్థానికులకు ఇబ్బంది కలుగుతోందని, ట్రాఫిక్ జాం అవుతోందని సాకులు చూపుతూ ప్రజాస్వామిక నిరసన కేంద్రాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తోంది.

 

ధర్నా చౌక్ వల్ల అక్కడున్న స్థానికులకు ఇబ్బంది ఎదురువుతుందనే అనుకుందాం. మరీ, నగరం నడిబొడ్డున ఉన్న అసెంబ్లీ వల్ల హైదరాబాద్ వాసులకు ఎంత ట్రాఫిక్ ఇబ్బంది

ఎదురువుతోందో అధికార పార్టీకి తెలియదా... ముఖ్యంగా శాసన సభ సమావేశాల సమయంలో అటు వెళ్లే సామాన్యుడి  కష్టాలు ఎలాంటివో వారికి తెలియవా... అలాగే, సిటీ సెంటర్ లో

కంపు కొడుతున్న హుస్సేన్ సాగర్ వల్ల నగరవాసుల ప్రాణానాకి ఎంత ముప్పు ఉందో పాలకపక్షానికి తెలియదా..

 

కాబట్టి ధర్నా చౌక్ తో పాటు నగరం నడిబొడ్డునే ఉన్న అసెంబ్లీని, హుస్సేన్ సాగర్ ను కూడా నగర శివార్లకు తరలిస్తే బాగుంటుంది. స్థానికులే కాదు కోటి మంది నివసిస్తున్న

హైదరాబాద్ వాసులు చిరకాల కోరిక ఇది... బంగారు తెలంగాణ దిశగా అడుగులువేస్తున్న సర్కారు ఈ విషయంపై కాస్త ఆలోచించాలి.

 

Follow Us:
Download App:
  • android
  • ios