వీఆర్ఎస్ తీసుకునే యోచనలో సీఎస్ సోమేశ్ కుమార్.. ?
తెలంగాణ కేడర్ నుంచి తనను కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేయడంపై సీఎస్ సోమేశ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి వెళ్లకుండా సోమేశ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకునే యోచనలో వున్నట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ తన కథనంలో తెలిపింది.

తెలంగాణ కేడర్ నుంచి తనను కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేయడంపై సీఎస్ సోమేశ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో ఏడాదిలో రిటైర్ కానున్న నేపథ్యంలో ఆయన ఏపీకి వెళ్లేందుకు విముఖంగా వున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి వెళ్లకుండా సోమేశ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకునే యోచనలో వున్నట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ తన కథనంలో తెలిపింది.
అంతకుముందు సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఈనెల 12లోపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని డీవోపీటీ ఉత్తర్వుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ALso REad: సోమేష్ కుమార్‌కు కేంద్రం షాక్.. తెలంగాణ నుంచి రిలీవ్, ఏపీకి వెళ్లిపోవాలని ఆదేశం
కాగా.. ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కూడా డీఓపీటీ రెండు రాష్ట్రాలకు కేటాయించింది. సోమేష్ కుమార్ కు ఏపీ కేడర్ ను డీఓపీటీ అలాట్ చేసింది. అయితే తాను తెలంగాణకు వెళ్తానని సోమేష్ కుమార్ చెప్పారు.తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించి సోమేష్ కుమార్ ను తెలంగాణ కేడర్ ను కేటాయించింది. పరిపాలన పరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించాలని కేంద్రం వాదిస్తుంది.
ఇదే వాదనతో కేంద్ర ప్రభుత్వం క్యాట్ తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. 2017లో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఈ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్ సోమేష్ కుమార్ ను తెలంగాణ కేడర్ కు కేటాయించడాన్ని రద్దు చేసింది. క్యాట్ తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఏపీ కేడర్ ను సోమేష్ కుమార్ కు కేటాయించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సోమేష్ కుమార్ స్థానంలో మరొకరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ కూడా లేకపోలేదు.