Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని... నిద్రిస్తున్న భర్తకు నిప్పంటించిన భార్య

వేరొకడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ అడ్డుగా వున్న భర్తను అతి దారుణంగా హతమార్చడానికి ప్రయత్నించిందో వివాహిత. ఈ దారుణం హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది. 

Wife tries to kill Husband over illicit affair AKP
Author
First Published May 29, 2023, 10:26 AM IST

పటాన్ చెరు : వివాహేతర సంబంధాలు భార్యాభర్తల పవిత్ర బంధాన్ని విచ్చిన్నం చేస్తున్నాయి. ఇతరులతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ జీవితాంతం కలిసి జీవించాల్సిన కొందరు దంపతులు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నారు. ఇలా ఓ మహిళ వేరొకడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భర్తను కిరాతకంగా చంపడానికి ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది.

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామానికి చెందిన నర్సింలు(32)కు దుండిగల్ కు చెందిన యాదమ్మతో వివాహమయ్యింది. వీరికి ముగ్గురు సంతానం. భార్యాభర్తలిద్దరూ కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఆస్తిపాస్తులు లేకున్నా కష్టపడి పనిచేస్తూ పిల్లలతో హాయిగా గడిపేవారు. ఇలా సాఫీగా సాగుతున్న వారి జీవితంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. 

 కూలీపనులకు వెళ్లే క్రమంలో యాదమ్మకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో వారిమధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో తన అక్రమ బంధానికి అడ్డుగా వున్న భర్తను చంపడానికి సిద్దమయ్యింది యాదమ్మ. 

Read More  నిజామాబాద్ లో ఘోరం.. కన్న తల్లిని రోకలి బండతో కొట్టి హతమార్చిన కూతురు

నిన్న(ఆదివారం) రాత్రి కూడా యాదమ్మతో నర్సింలు గొడవపడి పడుకున్నాడు. ఇదే అదునుగా భర్తను చంపడానికి సిద్దమయ్యింది యాదమ్మ. ఇంటిపక్కనే ఆగివున్న ఆటోలోంచి డీజిల్ తీసుకుని గాఢ నిద్రలో వున్న భర్తపై పోసి నిప్పంటించింది. దీంతో అతడు గట్టిగా కేకలు వేస్తూ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు గుమిగూడి మంటలు ఆర్పి నర్సింలు ప్రాణాలు కాపాడారు. 

అయితే మంటలు ఆర్పేసరికే నర్సింలు శరీరం 60 శాతం కాలిపోయింది. వెంటనే అతడిని అంబులెన్స్ లో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నా నర్సింలు పరిస్థితి విషమంగానే వున్నట్లు తెలుస్తోంది.

నర్సింలు సోదరుడి పోచయ్య ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. భర్తను చంపడానికి ప్రయత్నించిన యాదమ్మను అదుపులోకి తీసుకున్నారు. నేడు న్యాయస్థానంలో హాజరుపర్చి జైలుకు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios