కూరగాయల వ్యాపారం చేసే సదయ్యకు భార్యతో కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో ఆమె పుట్టింటికి వెళ్లి వారం కిందటే వచ్చింది.
కట్టుకున్న భర్త పట్ల ఓ మహిళ అతి దారుణంగా ప్రవర్తించింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త కళ్లల్లో కారం కొట్టి... ఆ తర్వాత మరుగుతున్న వేడి వేడి నూనె పోసింది. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హుస్నాబాద్ కు చెందిన సయ్యద్(44), రజిత దంపతులు తమ కుమార్తె తో కలిసి దీనబంధు కాలనీలో నివసిస్తున్నారు. కూరగాయల వ్యాపారం చేసే సదయ్యకు భార్యతో కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో ఆమె పుట్టింటికి వెళ్లి వారం కిందటే వచ్చింది. మంగళవారం సాయంత్రం బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన అతను భార్యను పిలిచినా స్పందించలేదు.
లోపలికి వెళ్లగానే భార్య అతడి కళ్లల్లో కారం చల్లి.. మరుగుతున్న వేడి నూనె భర్త ఒంటిపై పోసింది. అనంతరం కుమార్తెతో కలిసి అక్కడి నుంచి పారరైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సయ్యద్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
