Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం : భర్త వద్దన్నాడని, పక్కా ప్లాన్ తో.. పత్తిచేలోకి తీసుకెళ్లి...

ఈ విషయమై వెంకటయ్య పలుమార్లు భార్య మాధవిని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న Husbandను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని మాధవి, శేఖర్ పథకం పన్నారు. 

wife murder her husband extramarital affair in rangareddy
Author
Hyderabad, First Published Nov 6, 2021, 2:37 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రంగారెడ్డి : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను చంపేసింది. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని చన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 

ఎస్ ఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎరుకల వెంకటయ్య (30), మాధవి (26) దంపతులు. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన శేఖర్, మాధవి 
Extramarital affair నెరుపుతున్నారు. 

ఈ విషయమై వెంకటయ్య పలుమార్లు భార్య మాధవిని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న Husbandను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని మాధవి, శేఖర్ పథకం పన్నారు. 

ఈ క్రమంలో మాధవి ప్రియుడితో కలిసి గురువారం రాత్రి గ్రామానికి సమీపంలో ఉన్న ఓ వ్యక్తి పత్తి పంటలో వెంకటయ్యను చంపేశారు. వెంకటయ్య కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీశైలం తెలిపారు. 

Sajjanar: హైదరాబాద్‌ నుంచి నల్గొండకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్.. తనదైన స్టైల్‌లో

ఇలాంటి ఘటనే ముంబైలో జరిగింది..
పుణెలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఆచూకీ దొరకలేదు. ఎంత ప్రయత్నించినా.. ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. అయితే ఎంత పకడ్బందీగా నేరం చేసినా నిందితుడు ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడు. ఆ తప్పును పట్టుకోగలిగితే.. నేరం మిస్టరీ వీడిపోతుంది. అదే చేశారు పోలీసులు.

వ్యక్తి missing caseలో.. కాదేది అనుమానానికి అనర్హం.. అన్నట్టుగా  ఓ చెప్పును అనుమానించారు. అదే వారికి కేసు పరిష్కారానికి దారి చూపించింది. అలా ఓ వ్యక్తి హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం బయటపడింది.  

పుణెలో ఓ వ్యక్తి మాయమయ్యాడు. అతని కోసం దాదాపు పదిహేను రోజులుగా కేసు ఛేదించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు పోలీసులు.  ఈ క్రమంలో వారికి దొరికిన ‘foot ware’ కేసును పరిష్కరించింది.  accussedలను పట్టించింది.  ఈ సంఘటన పుణెలో చోటు చేసుకుంది.  ఆ వివరాలు…

బవ్థాన్  ప్రాంతానికి చెందిన  27 ఏళ్ల వ్యక్తి 2021, అక్టోబర్ 22 నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో అతని తల్లి దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు  కిడ్నాప్  సహా పలు యాంగిల్స్ లో దర్యాప్తు కొనసాగించారు.  ఈ క్రమంలో పోలీసులకు తప్పిపోయిన వ్యక్తి చెప్పు... ఓ ఇంటిముందు కనిపించింది.

ఆ ఇంట్లో ఉంటున్న వ్యక్తిని స్టేషన్ కు పిలిపించారు పోలీసులు. దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. తప్పిపోయిన వ్యక్తిని  సదరు  ఇంటి owner హత్య చేశానని తెలిపాడు. murder చేసేంత కోపం ఏంటని ఆరా తీయగా.. హత్యచేయబడిన వ్యక్తికి... తన భార్యతో extra marital affair ఉందని...  అందుకే అతనిని  చంపేశానని తెలిపాడు.

అక్టోబర్ 21న చనిపోయిన వ్యక్తి మొబైల్ నెంబర్ నుంచి తన wifeకు రెండు మిస్డ్ కాల్స్ వచ్చాయని తెలిపాడు నిందితుడు.  అంతేకాక అదే రోజు రాత్రి victim తన ఇంటికి వచ్చి తన భార్యను కలిశాడని వెల్లడించాడు.  వారి బంధం గురించి తెలిసిన మరో ఇద్దరి సహాయంతో బాధితుడిని హత్య చేశాడు.  కత్తితో పొడిచి చంపాడు.  ఆ తరువాత deadbodyని తగలబెట్టాడు.  ప్రస్తుతం పోలీసులు ఇద్దరిని అరెస్టు చేయగా... మరో వ్యక్తిని మధ్యప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios