Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో రాసలీలలు: లవర్‌తో కలిసి భర్తను చంపిన భార్య

హైద్రాబాద్ లో వివాహేతర సంబంధం నెపంతో ఓ వివాహిత తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన హైద్రాబాద్ శివరాంపల్లిలో చోటు చేసుకొంది.

wife kills her husbadnd with the help of lover in Hyderabad
Author
Hyderabad, First Published Oct 31, 2021, 4:05 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్:Extramarital Affair నెపంతో వివాహిత ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది. ఈ హత్యలో వివాహితతో పాటు ఆమె ప్రియుడు మరో ముగుర్గు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలనదు ఎల్బీనగర్ డీసీపీ  సన్‌ప్రీత్ సింగ్ మీడియాకు వివరించారు. రాజేంద్రనగర్, శివరాంపల్లికి చెందిన షేక్‌ ఆదిల్‌ అలియాస్‌ Naresh(35) స్థానికంగా పాల వ్యాపారం చేస్తున్నాడు. నరేష్ కు ఇద్దరు భార్యలు.

also read:హయత్ నగర్ కారులో మృతదేహం.. భార్యతో పాటు మరో ఇద్దరు అరెస్ట్..


 మొదటి భార్య జోయాబేగం సైదాబాద్‌ మోయిన్‌బాగ్‌లో ఉంటోంది.అదే ప్రాంతంలో ఉండే సయ్యద్‌ ఫరీద్‌ అలీ అలియాస్‌ సోహైల్‌(27)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి భర్త షేక్‌ ఆదిల్‌ ఆమెను తరచూ వేధించేవాడు. ఈ విషయాన్ని జోయా బేగం ప్రియుడు ఫరీద్‌ అలీకి చెప్పింది. దీంతో  అతడి అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ పథకం వేశారు.  

 ఫరీద్‌ అలీ తన స్నేహితులు ముహమ్మద్‌ రియాజ్, షేక్‌ మావియా, మహ్మద్‌ జహీర్‌లతో కలిసి ఈ నెల 19 న రాత్రి జోయాబేగం ఇంటికి చేరుకున్నారు. జోయాబేగంతో పాటు మిగతా నలుగురూ కలిసి ఇంట్లో నిద్రలో ఉన్న షేక్‌ ఆదిల్‌ అలియాస్‌ నరేష్‌ మెడకు చున్నీతో ఉరి బిగించారు. ఆ కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం షేక్‌ ఆదిల్‌ మృతదేహాన్ని ఆటో ట్రాలీలో పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మామిడిపల్లి రోడ్డుకు తరలించారు. అక్కడ మృదేహంపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. అయితే తాము హత్యకు ఉపయోగించిన  ఆధారాలను కూడ నిందితులు కాల్చివేశారు.  కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు హతుడు షేక్‌ ఆదిల్‌గా గుర్తించారు.నిందితులు ఉపయోగించిన ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు , మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

 దర్యాప్తులో వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యే ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు తేల్చేరు. హత్యలో పాల్గొన్న ఐదుగురినీ అరెస్టు  శనివారం రిమాండ్‌కు తరలించారు.  సమావేశంలో వనస్ధలిపుం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు,  అర్జునయ్య, శ్రీదర్‌రెడ్డి, సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకొన్నాయి. వివాహేతర సంబంధం ఘటనలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని స్వాతి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. తన భర్తను హత్య చేసిన భార్య ప్రియుడిని తన భర్త స్థానంలోకి తీసుకురావాలని ప్రయత్నించింది.అయితే ఈ విషయమై అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు శాస్త్రీయమైన ఆధారాలతో ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు.. ఈ కేసులో స్వాతి సహా ఆమె ప్రియుడు రాజేష్ అరెస్టయ్యారు. మరో వైపు స్వాతి తన భర్తను ప్రేమించి పెళ్లి చేసుకొంది. అయితే ప్రియుడి మోజులో పడి ఆమె భర్తను హత్యచేసింది. ఈ ఘటన సినిమాను పోలి ఉండడంతో పెద్ద సంచలనంగా మారింది.. స్వాతిని తమ కూతురుగా కూడా చెప్పుకొనేందుకు తల్లిదండ్రులు ఇష్టపడమని తెగేసీ చెప్పారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios