హయత్ నగర్ కారులో మృతదేహం.. భార్యతో పాటు మరో ఇద్దరు అరెస్ట్...
Hayatnagarలో శనివారం కారులో మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఈ మృతదేహం లారీ డ్రైవర్ ముస్తాక్ పటేల్ (46)గా గుర్తించారు. ముస్తాక్ కు హత్య చేసిన కేసులో ముగ్గురిని మంగళవారం అరెస్టు చేశారు.
హైదరాబాద్ : వివాహేతర సంబంధాలు.. కారణాలేవైనా విషాదాంతాలే అవుతాయి. ఎన్నో కేసులు చూస్తున్నా, తెలిసినా చివరికి దాన్ని ఉచ్చులోనే పడుతుంటారు. సంసారంలో అసంతృప్తులు, వ్యామోహం, కోరిక, క్షణికావేశం, లైంగికవాంఛ వెరసి సంసారాన్ని చిన్నాభిన్నం చేస్తాయి.
భాగస్వాముల్లో ఒకరిని హంతకులుగా, మరొకరిని మృతులుగా మార్చి కానీ ఈ సంబంధాలు అంతం కావు. కొద్దిరోజుల వారి సరదా.. జీవితకాలపు శిక్షగా పరిణమించి జీవితాల్సి అల్లకల్లోలం చేస్తాయి. అయినా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.
అలాంటి విషాద కర సంఘటనే Hyderabad లో చోటు చేసుకుంది. వావివరుసలు మరిచి దూరపు చుట్టం, మరిది వరుసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. ఏకంగా భర్తను హత్య చేసింది. తెలియకుండా ఉండాలని దూరంగా తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయింది.
Hayatnagarలో శనివారం కారులో మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఈ మృతదేహం లారీ డ్రైవర్ ముస్తాక్ పటేల్ (46)గా గుర్తించారు. ముస్తాక్ కు హత్య చేసిన కేసులో ముగ్గురిని మంగళవారం అరెస్టు చేశారు.
అరెస్టయిన నిందితుల్లో బాధితుడి భార్య, ఆమె ప్రియుడు ఉన్నారు. మృతుడు మహ్మద్ ముస్తాక్ పటేల్ (46) లారీ డ్రైవర్. అతను తన భార్య ఫిర్దౌస్ బేగంకు దూరపు బంధువు మహ్మద్ హమీద్ పటేల్‌తో extra marital affair ఉందని అనుమానించాడు. దీంతో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు.
ఇది తట్టుకోలేని భార్య, తను illigal relationship పెట్టుకున్న హమీద్ పటేల్ తో కలిసి లారీ డ్రైవర్‌ను అంతమొందించేందుకు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో murderకు ఉపయోగించిన కత్తి, కారం పొడి కొనుగోలు చేయడంలో మూడో నిందితుడు సయ్యద్ నయాబ్ మిగతా ఇద్దరు నిందితులకు సహకరించాడు.
బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రాడ్, knifeని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్, హయత్‌నగర్ హత్య కేసు మిస్టరీని శనివారమే పోలీసులు చేధించారు. మృతుడికి వరుసకు తమ్ముడయ్యే వ్యక్తి, భార్య కలిసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య చేసి మృతదేహాన్ని నగర శివార్లలోకి తరలించారు.
హయత్‌నగర్ : కారులో మృతదేహం.. వీడిన మిస్టరీ, మరిదితో కలిసి భర్తను చంపిన భార్య
అయితే రోడ్డుపై కారు ఆగిపోవడంతో మృతదేహంపై కారం పోడి చల్లి అక్కడి నుంచి పరరాయ్యారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు మొదట అనుమానించారు. చివరికి అదే నిజమని తేలింది. మృతుడిని కాచిగూడకు చెందిన లారీ డ్రైవర్ ముస్తాఫాగా గుర్తించారు.
అంతకుముందు హయత్‌నగర్ బావర్చీ హోటల్ ఎదురుగా శనివారం ఉదయం కారులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఈ హత్య అర్ధరాత్రి జరిగి ఉండొచ్చని పోలీసులు భావించారు. ఎక్కడో చంపేసి హయత్‌నగర్‌లో వదిలివెళ్లినట్లు పోలీసులు అనుమానించారు. బావర్చీతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు.