ఉద్యోగం ఇచ్చి తనకు జీవనోపాధి కల్పించిన యజమాని పట్ల గౌరవంగా ఉండాల్సిందిపోయి... అతని సంసారంలోనే చిచ్చుపెట్టాడు. యజమాని భార్యపై మోజు పెంచుకున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి.. తన మాయలో పడేసుకున్నాడు. అనంతరం ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా.. అడ్డుగా ఉన్నాడని యజమానిని హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది.

Also read లేడీ టెక్కీపై భర్త రాక్షసత్వం: ఫొటోలు పెట్టి అసభ్యకరమైన వ్యాఖ్యలు...

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇల్లంతకుంట మండలం రామోజీపేటకు చెందిన తిరుపతి బద్దెనపల్లిలో టెంట్ హౌజ్ నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య మమత ఉంది. కాగా... తిరుపతి వద్ద పనిచేసే సురేష్... మమత పై కన్నేశాడు. మాయమాటలతో ఆమెను లోబరుచుకున్నాడు. ఇద్దరూ తిరుపతికి తెలీకుండా అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

తిరుపతికి తెలిసి పద్ధతి మార్చుకోవాలని మందలించడంతో అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు సురేశ్‌తో కలిసి మమత పథకం రచించింది. నలుగురు వ్యక్తులకు రూ.40వేలు సుపారీ ఇచ్చి మరీ హత్యకు ప్లాన్ వేశారు. మమత తనకు కడుపునొప్పి వచ్చిందని భర్తను అర్ధరాత్రి బస్వాపూర్‌కు తీసుకెళ్లింది. అప్పటికే గ్రామశివారులో మాటువేసిన సురేశ్‌ అతడి స్నేహితులు కారుతో అటకాయించి కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసి విచక్షణారహితంగా పొడిచి హత్యచేశారు. 

ఇక చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత కారులో అక్కడి నుంచి పరారయ్యారు. హ త్యను ప్రమాదంగా మార్చేందుకు మమత శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ నిజం బయటకు వచ్చింది. హత్యకేసును చేధించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.