భర్త కళ్లలో కారం చల్లి హత్య చేసిందో భార్య. దీనికి ఆమె తల్లిదండ్రులు సహకరించారు. ఈ ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది.
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానిక చంద్రశేఖర్ కాలనీలో ఓ హత్య కలకలం రేపింది. ఓ భార్య భర్తను దారుణంగా హతమార్చింది. పుట్టింటికి వచ్చినా తన దగ్గరికి వచ్చి వేధిస్తుండడంతో భర్త పై దాడి చేసింది ఓ భార్య. తల్లిదండ్రుల సహకారంతో భర్త కళ్ళల్లో కారం కొట్టి, దారుణంగా హత్య చేసింది.
దీంతో కృష్ణ అనే భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని భార్యను, అత్తమామలను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
