26రోజులు కాపురం చేసి.. ఎస్కేప్ అయ్యాడు

First Published 25, Jul 2018, 11:44 AM IST
wife file police case against husband and mother in law over harrasing for dowry
Highlights

భర్త కోసం రోరజుల తరబడి ఎదురుచూసి.. తీరా పట్టుకొని నిలదీస్తే.. అదనపు కట్నం కావాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

పెళ్లి చేసుకొని 26రోజుల పాటు ఆనందంగానే కాపురం చేశాడు. తర్వాత ఏమైందో ఏమో తెలీదు.. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. భర్త కోసం రోరజుల తరబడి ఎదురుచూసి.. తీరా పట్టుకొని నిలదీస్తే.. అదనపు కట్నం కావాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన కాసాని భవ్యభవానీ తల్లిదండ్రులు చనిపోవడంతో మేనత్త వద్ద పెరిగింది. నగరంలో సివిల్‌ ఇంజనీర్‌గా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గతేడాది ఆగస్టు 13వ తేదీన పదాతి వెంకటేశ్వరరావుతో వివాహం అయింది. అతడు హైటెక్‌ సిటీలో ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. వివాహం కాగానే ఇద్దరూ ఎల్‌ఐసీ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని ఉంటున్నారు. కాపురం 26 రోజులు బాగానే సాగింది.
 
     ఆ తర్వాత వెంకటేశ్వరరావు పని నిమిత్తం విజయవాడ వెళ్లి తిరిగి రాలేదు. భవానీ భర్తను వెతికి పట్టుకొని నిలదీసింది. అదనపు కట్నం ఇవ్వాలని అతడు భార్యను అడిగాడు. పెళ్లి సమయంలో భవానీ తాను దాచుకున్న 15 లక్షల రూపాయలు ఇచ్చింది. అవి సరిపోవని వెంకటేశ్వరరావు, అతడి తండ్రి, తల్లి, ఆడపడుచు, ఆమె భర్త ఇలా అందరు కలిసి భవానిని వేధిస్తున్నారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరికీ కౌన్సెలింగ్‌ నిర్వహించినా సయోధ్య కుదరలేదు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

loader