హైదరాబాద్: మంచిర్యాల  జిల్లాలోని బెల్లంపల్లిలో  భర్తకు కరోనా సోకిందని భార్య ఆత్మహత్య చేసుకొంది.  కరోనాతో భర్త ఆరోగ్య పరిస్థితి విషమించడంతో  హైద్రాబాద్ కి తరలించారు. భర్త ఆరోగ్యంపై బెంగతో ఆమె ఆత్మహత్య చేసుకొంది.బెల్లంపల్లి పట్టణంలోని  హనుమాన్ బస్తీకి చెందిన  వివాహిత సుద్దాల శైలజ భర్తకు కరోనా సోకింది. స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో  మెరుగైన చికిత్స కోసం ఆయనను హైద్రాబాద్ ఆసుపత్రికి తరలించారు. 

భర్త ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర మనోవేదనకు గురైన ఆమె బుధవారం నాడు ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన ఆ  కుటుంబంలో విషాదాన్ని నింపింది.కరోనా సోకితే మెరుగైన వైద్య చికిత్స తీసుకొంటే కోలుకొంటారు. కానీ ఈ వైరస్ సోకిందని  ఆత్మహత్య చేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ బారినపడకుండా ఉండేందుకు మాస్కులు, భౌతిక దూరం పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల సూచనలను పట్టించుకోకుండా వ్యవహరించడం వల్ల  కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.