పెద్దపల్లి: కరోనా మహమ్మారి కుటుంబాలకు కుటుంబాలనే బలి తీసుకుంటోంది. తాజాగా ఈ మహమ్మారి బారినపడ్డ భార్యాభర్తలు రెండు రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మల్లేష్, సృజన దంపతులు ఇటీవల కరోనా బారిపడ్డాడు. దీంతో కరీంనగర్ లోని ఓ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం చేరారు. అయితే వీరిద్దరి ఆరోగ్యం పూర్తిగి క్షీణించడంతో రెండు రోజుల్లో ఇద్దరూ చనిపోయారు. 

నిన్న(బుధవారం) మల్లేష్ చనిపోగా ఇవాళ(గురువారం) సృజన మృతి చెందింది. ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే భార్యభర్తలిద్దరు చనిపోవడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. 

read more  అనారోగ్యం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య..!

ఇదిలావుంటే తెలంగాణలో ప్రస్తుతం 38,632 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.52 శాతం వుండగా.. పాజిటివిటీ రేటు 6 శాతం నుంచి 4.1 శాతానికి పడిపోయిందని తెలిపింది. కోవిడ్ నుంచి 3,816 మంది కోలుకున్నారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 528 కేసులు నమోదయ్యాయి. 

 ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 8, భద్రాద్రి కొత్తగూడెం 128, జగిత్యాల 70, జనగామ 45, జయశంకర్ భూపాలపల్లి 51, జోగులాంబ గద్వాల 73, కామారెడ్డి 26, కరీంనగర్ 170, ఖమ్మం 214, కొమరంభీం ఆసిఫాబాద్ 24, మహబూబ్‌నగర్ 158, మహబూబాబాద్ 141, మంచిర్యాల 103, మెదక్ 43, మేడ్చల్ మల్కాజిగిరి 213, ములుగు 39, నాగర్ కర్నూల్ 104, నల్లగొండ 218, నారాయణ పేట 25, నిర్మల్ 16, నిజామాబాద్ 45, పెద్దపల్లి 137, రాజన్న సిరిసిల్ల 56, రంగారెడ్డి 229, సంగారెడ్డి 98, సిద్దిపేట 131, సూర్యాపేట 178, వికారాబాద్ 101, వనపర్తి 93, వరంగల్ రూరల్ 102, వరంగల్ అర్బన్ 158, యాదాద్రి భువనగిరిలలో 45 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.