నీకు బంధువు కాబట్టే సినిమా బాగుందంటున్నవా?అర్జున్ రెడ్డి సినిమా చూసి బయట డాక్టర్లు చెడిపోతారు మీద చర్యలు అంటూ డసినిమాను ఎంకరేజ్ చేస్తవా?సిఎం స్పందించాలి సినిమా మూసేయాలి

అర్జున్ రెడ్డి సినిమా మీద మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. ఆ సినిమాకు కేటిఆర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో తేలిపోయిందన్నారు విహెచ్. అర్జున్ రెడ్డి సినిమా చూసి యువత చెడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా లో ర్యాగింగ్ చేసి పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ చేశారని, మందు తాగి 300 మంది పేషంట్లకి వైద్యం చేశా అని సినిమాలో ఒప్పుకున్నారని ఇది ఏం మెసేజ్ ఇస్తుందని ప్రశ్నించారు. 

ఇలాంటి సినిమాలు చూసి బయట వున్న వైద్యులు కూడా మద్యం తాగి వైద్యం చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాని చూసిన కేటిఆర్ యువత కి ఎం చెప్పదల్చుకున్నాడని ప్రశ్నించారు. తన బంధువు అయినందుకే సినిమా చూసి బాగుంది అని మంత్రి కేటీఆర్ అంటున్నారా అని నిలదీశారు. సినిమా పై సెన్సార్ బోర్డు, కమిషనర్ మహేందర్ రెడ్డి కి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఇలాంటి సినిమాలని సెన్సార్ బోర్డ్ నిషేధించాలి 

అర్జున్ రెడ్డి సినిమాలో విపరీతంగా తీసుకుంటారని, ఇలాంటి సినిమాలు తీసి ప్రేక్షకులకి ఏం చెప్పదల్చుకున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అర్జున్ రెడ్డి సినిమా చూసి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బయట తీసుకున్నవారి పై చర్యలు అంటున్న కేటీఆర్ సినిమాలో తీసుకున్న వారిని ప్రోత్సహించే విధంగా సినిమా బాగుంది అనడం లో ఉద్దేశ్యం ఏంటి అని ప్రశ్నించారు.

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి