ఎమ్మెల్యే గంగులపై కార్పొరేటర్ విమర్శలు తన డివిజన్ లో అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని విమర్శ రాజీనామా లేఖ పంపిన జయశ్రీ
కరీంనగర్ టిఆర్ఎస్ లో కొత్త చిచ్చు రాజుకున్నది. కరీంనగర్ కార్పొరేషన్ లోని 30వ వార్డు సభ్యురాలు జయశ్రీ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తున్న సందర్భంలో ఆమె కంటతడి పెట్టారు. ఇంతకూ ఆమెకు వచ్చిన కష్టాలేంటని జనాల్లో చర్చ జరుగుతున్నది. ఆమె కష్టాలపై అందిస్తున్న స్టోరీ ఇది. చదవండి.

కరీంనగర్ లో 30వ వార్డులో జయశ్రీ అనే మహిళ భారీ మెజార్టీతో జయశ్రీ గెలుపొందారు. అయితే ఆమె డివిజన్ లో తన మీదే ఓడిపోయిన అభ్యర్థికి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రోత్సహిస్తూ తనను చిన్నచూపు చూస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది.
తన డివిజన్ ను దత్తత తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ ను ఆమె కోరింది. ఒక సభలో ఆమె విన్నపాన్ని స్వీకరించిన మంత్రి ఈటల తాను 30వ డివిజన్ ను దత్తత తీసుకునేందుకు అంగీకరించారు. అనంతరం ఆ డివిజన్ కు 5కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం మంత్రి మంజూరు చేసినా ఎమ్మెల్యే అడ్డుతగిలి వాటిని రిలీజ్ కాకుండా చేశాడని ఆరోపించారు. గడిచిన మూడేళ్ల కాలంగా తనను వేధిస్తున్నారని ఆమె కంటతడి పెట్టారు. కేవలం ఎమ్మెల్యే వైఖరి కారణంగానే తాను ఇబ్బందులకు గువుతున్నానని చెప్పారు.
తాను రాత్రికి రాత్రే నామినేటెడ్ పదవిని స్వీకరించిన వ్యక్తిని కాదని జయశ్రీ చెప్పారు. తన భర్త కష్టపడి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకుంటేనే గెలిచానని గుర్తు చేశారు. పిచ్చుక లాంటి తన మీద అంత పెద్ద స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎందుకు బ్రహ్మాస్త్రం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా డివిజన్ లో నన్ను గెలిపించిన ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నానని, ఎమ్మెల్యే అడ్డుపడడం వల్ల ఎలాంటి అభివృద్ధి చేయలేకపోతున్నానని ఆమె చెప్పారు. అందుకే తన రాజీనామాను ఎంపి, మంత్రి, సిఎం ఆఫీసుకు పంపినట్లు చెప్పారు.
మొత్తానికి కరీంనగర్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మరి ఈ వివాదాన్ని అధికార పార్టీ పెద్దలు ఎలా పరిస్కరిస్తారో అన్న చర్చ ఇంకా సాగుతోంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
<!-- You're using demo endpoint of Iframely API commercially. Max-width is limited to 320px. Please get your own API key at https://iframely.com. -->ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్
