MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Heavy Rain Alert : బలపడుతున్న అల్పపీడనం, 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ.. అతిభారీ వర్షాలతో ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే

Heavy Rain Alert : బలపడుతున్న అల్పపీడనం, 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ.. అతిభారీ వర్షాలతో ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది… దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురవడమే కాదు సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 03 2026, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో ఇక కుండపోత వానలే
Image Credit : Getty

తెలుగు రాష్ట్రాల్లో ఇక కుండపోత వానలే

Heavy Rain Alert : ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి... ఇవి యాక్టివ్ గా మారడంతో వర్షాలు జోరందుకున్నాయి. జూలై నెల ఇలా ఆరంభంకాగానే అలా వర్షాలు ఊపందుకున్నాయి... ఇప్పుడు ఏకంగా ప్రమాద హెచ్చరికలు జారీచేసే స్థాయికి చేరుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ తీరప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు, ఈదురుగాలులు అల్లకల్లోలం సృష్టించే అవకాశాలున్నాయి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సముద్రంలో కూడా అలజడి కొనసాగే అవకాశాలున్నాయి... అందుకే కళింగపట్నం నుండి మచిలీపట్నం వరకు అన్ని పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
Image Credit : Gemini AI

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాల తీవ్రత పెరిగింది. ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది... ఇది మరింత బలపడుతూ ముందుకు కదులుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ప్రస్తుతానికి అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో కొనసాగుతోందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్రలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు...మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఈ అల్పపీడనం బలపడి ఆంధ్ర ప్రదేశ్ తీరంవైపు వస్తే మాత్రం కుండపోత వర్షాలు తప్పవంటున్నారు. రానున్న 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని... సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించింది. తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచిస్తోంది.

Related Articles

Related image1
Now Playing
Cyclone alert: బంగాళాఖాతంలో తుపాను..? ఈ జూలైలో జోరువానలు? | Heavy rains AP | Asianet News Telugu
Related image2
Now Playing
Hyderabad Heavy Rains: అమరావతి సంగతి దేవుడెరుగు ముందు హైదరాబాద్ మునిగిపోతుంది | Asianet News Telugu
35
రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Image Credit : Gemini AI

రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

యాక్టివ్ గా మారిన రుతుపవనాలు, బలపడనున్న అల్పపీడనం ప్రభావాలతో రాగల 24 గంటల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు తప్పవంటోంది విపత్త నిర్వహణ సంస్థ (APSDMA). ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో కుండపోత తప్పదని హెచ్చరిస్తోంది. ఇక శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. వర్షాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని APSDMA MD ప్రఖర్ జైన్ సూచించారు.

45
తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు
Image Credit : X/Hyderabad Traffic Police

తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు

తెలంగాణలో కూడా ఇప్పటికే వర్షాల తీవ్రత పెరిగింది. ఇవాళ (జూలై 3, శుక్రవారం) ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

ఇక రేపు (జూలై 4, శనివారం) తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల పెద్దపల్లి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయట.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంటే ఈ జిల్లాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. 

రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయంటోంది వెదర్ డిపార్ట్మెంట్... ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం (జూలై 5) కూడా అతిభారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

pic.twitter.com/Jsm3h3N15L

— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) July 3, 2026

55
తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనాలివే...
Image Credit : Gemini AI

తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనాలివే...

జూలై 3 నుండి 5 వరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా జోరువానలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. తెలంగాణ మొత్తాన్ని ముసురు కమ్ముకుంటుందని... ఈ వీకెండ్ మొత్తం ఇదే వాతావరణం ఉంటుందని తెలిపారు.

ఉత్తర తెలంగాణలో కుండపోత వర్షాలు... మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు... దక్షిణ తెలంగాలో చిరుజల్లులు కురుస్తాయని వెదర్ మ్యాన్ తెలిపారు. రాబోయే రోజుల్లో వర్షాలు మరింత పెరుగుతాయని... హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు మొదలవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ చెబుతున్నారు.

HEAVY - VERY HEAVY RAIN ALERT FOR NORTH TELANGANA 

PEAK IMPACT OF LPA - July 3-5

Dear people of North Telangana, get ready for first musuru rains (ముసురు వానలు) of this season with PERIODS OF RAIN ahead in North Telangana, overall HEAVY - VERY HEAVY RAINS ahead ⚠️⚠️

Pink… pic.twitter.com/mGcuzNeFx8

— Telangana Weatherman (@balaji25_t) July 3, 2026

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఏషియానెట్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Andhra pradesh: ఏపీలో మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌.. రూ. 16,350 కోట్ల ప్రాజెక్టుకు చంద్ర‌బాబు శంకుస్థాప‌న
Recommended image2
Now Playing
పెమ్మసాని స్పీచ్ కి దద్దరిల్లిన సభ సీఎం చంద్రబాబు ఫిదా | Asianet News Telugu
Recommended image3
Now Playing
CM Chandrababu Speech: హీరో మోటార్స్ విస్తరణ సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Related Stories
Recommended image1
Now Playing
Cyclone alert: బంగాళాఖాతంలో తుపాను..? ఈ జూలైలో జోరువానలు? | Heavy rains AP | Asianet News Telugu
Recommended image2
Now Playing
Hyderabad Heavy Rains: అమరావతి సంగతి దేవుడెరుగు ముందు హైదరాబాద్ మునిగిపోతుంది | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved