ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు కేంద్రం మంత్రి అరుణ్జైట్లీ, ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తదితరులతో మాట్లుడుతున్నా ఉపయోటం కనబడటం లేదు.

నోట్ల రద్దు తదనంతర పరిణామాలను గమనిస్తుంటే కేంద్రప్రభుత్వం ఏపిపై పగబట్టిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత దేశమంతా చిన్న నోట్లకు, కొత్త నోట్లకు ఇబ్బందులు మొదలయ్యాయి. అందులో భాగంగానే ఏపిలో కూడా ఇక్కట్లు తప్పటం లేదు. అయితే, రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏ మేరకు నగదు అవసరమో బ్యాంకర్లు పెడుతున్న ఇండెంటును కేంద్రం ఏమాత్రం ఖాతరు చేయకపోవటంతోనే సమస్యలు పెరిగిపోతున్నాయి.

బ్యాంకర్లు, ప్రభుత్వం పెడుతున్న ఇండెంట్ కు వస్తున్న నగదుకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. వచ్చిన నగదును పూర్తిస్ధాయిలో పంపిణీ చేయలేక ప్రజలు, ప్రభుత్వం మధ్య బ్యాంకులు నలిగిపోతున్నాయి. తాజాగా, రాష్ట్ర అవసరాలకు రూ. 2 వేల కోట్లు కావాలని పెట్టిన ఇండెంటుకు వచ్చింది కేవలం రూ. 520 కోట్లు మాత్రమే. నోట్ల రద్దు నేపధ్యంలో ఆర్బిఐ మొదటి నుండి ఏపితో ఇదే విధంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబతున్నారు.

అప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు కేంద్రం మంత్రి అరుణ్జైట్లీ, ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తదితరులతో మాట్లుడుతున్నా ఉపయోటం కనబడటం లేదు. దాంతో ప్రజలకు ఏమి సమాధానం చెప్పుకోవాలో చంద్రబాబు కూడా అర్ధం కావటం లేదు. మొన్నటికి మొన్న రూ. 6 వేల కోట్లు కావాలంటే 1500 కోట్ల రూపాయలు పంపారు. అంతకుముందు 2వేల కోట్ల రూపాయలు అవసరమంటే 142 కోట్లు పంపారు.

పంపిన మొత్తం కూడా రూ. 2 వేల నోట్లే కావటంతో చెలామణికీ ఇబ్బందిగా ఉంది. అదే విషయాన్ని చెబుతూ సిఎం 100 రూపాయల నోట్లను పంపమంటే అసలు పట్టించుకోలేదు. రూ. 2 వేల నోట్లకు బయట చిల్లర సమస్యగా ఉండటంతో జనాలెవరూ 2 వేల నోట్లను తీసుకోవటానికి ఇష్టపడటం లేదని బ్యాంకర్లు మొత్తుకుంటున్నారు.

వచ్చిన నగదు సరిపోక, బయట చిల్లర లేదని వచ్చిన వాటిని తీసుకోవటానికి ప్రజలు ఇష్టపడకపోవటంతో ఏమి చేయాలో అర్ధంకాక బ్యాంకర్ర్లు బుర్రగోకుంటున్నారు. ఇదిలావుండగా రాష్ట్రానికి మళ్లీ శనివారం కానీ నగదు నిల్వలు రావని బ్యాంకర్లు చెబుతుండటంతో దాని ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడుతున్నది.