Asianet News TeluguAsianet News Telugu

కేటిఆర్ అసలు పేరు రేవంత్ కు చెప్పిందెవరు?

  • కేటిఆర్ అసలు పేరు రేవంత్ కు ఎలా తెలిసింది
  • చెప్పిందెవరు 
  • ఎప్పుడు తెలిసింది
  • జోరుగా సాగుతున్న చర్చలు
who revealed ktrs original name to Revanth

తెలంగాణ సిఎం తనయుడు, మంత్రి కేటిఆర్ మీద ఇటీవల టిడిపి తెలంగాణ నేత రేవంత్ రెడ్డి ఒక విమర్శ చేశారు. కేటిఆర్ అసలు పేరు అది కాదని, అజయ్ అని బాంబు పేల్చారు రేవంత్. మరి ఆ విషయం ఆయనకు ఎలా తెలిసింది? ఆయనతో ఎవరు చెప్పారు. రేవంత్ కు ఎప్పుడు తెలిసింది. ఉండి ఉండి     ఇప్పుడే ఆ పేరును ఎందుకు బయట పెట్టారు? ఈ వివరాలన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తెలంగాణ సిఎం కేసిఆర్ గతంలో తనకు ఎమ్మెల్యే టికెట్ రావాలన్న ఆరాటంలో తన కొడుకు పేరు అజయ్ అయినప్పటికీ దాన్ని మార్చి కల్వకుంట్ల తారక రామారావు అని పెట్టినట్లు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ మనసు దోచేందుకు సొంత కొడుకు పేరునే మార్చుకున్న వ్యక్తి కేసిఆర్ అంటూ ఘాటుగానే విమర్శించారు. ఈ నేపథ్యంలో కేటిఆర్ అసలు పేరు అజయ్ అనే విషయాన్ని కూడా వెల్లడించారు. మరి ఈ పేరు నిజమా కాదా అన్న విషయమై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

అజయ్ పేరు నిజం కాకపోతే టిఆర్ఎస్ నుంచి ఇప్పటికే రేవంత్ కామెంట్లకు కౌంటర్ వచ్చేదే. కానీ టిఆర్ఎస్ లో రేవంత్ కామెంట్ల మీద ఎవరూ మాట్లాడలేదు. అంటే ఆ పేరు నిజమే కావొచ్చా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ఇంకో వాదన కూడా ఉంది. టిఆర్ఎస్ మీద కానీ, కేసిఆర్ మీద కానీ రేవంత్ ఏ రకమైన విమర్శలు చేసినా మేము పట్టించుకోం. వేరేవాళ్లు మాట్లాడితే స్పందిస్తాం అన్న ధోరణి కూడా టిఆర్ఎస్ నేతల్లో ఉంది. అదే నిజమైతే కీలకమైన విషయాలపైనా, వ్యక్తిగత విషయాలపైనా రేవంత్ విమర్శలు చేస్తున్నారు. అది కూడా తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టి లోపలేస్తామన్న హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా విమర్శలు చేస్తున్నాడంటే అందులో ఏమైనా నిజాలే ఉండొచ్చు కదా అని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

అసలు చర్చ ఏమంటే అసలు కేటిఆర్ పేరు అజయ్ అనే విషయం రేవంత్ కు ఎలా తెలిసింది. ఎప్పుడు తెలిసింది? ఇప్పుడే ఎందుకు వెల్లడించారు అన్నదానిపై బాగా చర్చ జరుగుతున్నది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ వాస్తవాన్ని రేవంత్ కు టిఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తుల ద్వారా చేరిందని చెబుతున్నారు. ఎప్పుడో 30 ఏండ్ల కిందటి ముచ్చటను ఇప్పుడు బయటపెట్టిండంటే ఆ విషయం కేసిఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుల ద్వారా రేవంత్ కు తెలిసి ఉండొచ్చని టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. ఇంకో విషయమేమంటే రేవంత్ టిడిపిలో చేరకముందు టిఆర్ఎస్ లో పనిచేశారు. జెడ్పీటీసిగా కూడా టిఆర్ఎస్ లో గెలిచారు. ఆ సమయంలో కేసిఆర్ కుటంబానికి రేవంత్ సన్నిహితంగా ఉన్నట్లు చెబుతుంటారు. ఆ సమయంలో ఈ విషయం రేవంత్ కు తెలిసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మరి ఈ సమయంలోనే ఎందుకు బయట పెట్టారబ్బా అన్న ప్రశ్న కూడా వస్తోంది. అయితే సిఎం కేసిఆర్ జెఎసి ఛైర్మన్ కోదండరాం పై తీవ్రమైన భాషలో విమర్శలు చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో రేవంత్ కూడా గతకాలపు విషయాలను, ఇంతకాలం తెలంగాణ సమాజానికి తెలియకుండా రహస్యంగా ఉంచిన విషయాలను వెల్లడించి ఉండొచ్చని టిడిపి నేతలు అంచనా వేస్తున్నారు.

అయితే కేటిఆర్ పేరు నిజంగానే అజయ్ అన్నది నిజమేనా? ఆ పేరు తనకెలా తెలిసింది? టిఆర్ఎస్ లో ఉన్నప్పుడే తెలిసిందా? లేక తర్వాత తెలిసిందా? రేవంత్ కు చెప్పినవారెవరు? అయినా ఇప్పుడే రేవంత్ ఆ రహస్యాన్ని ఎందుకు వెల్లడించారు. ఈ అన్ని విషయాల మీద మరింత క్లారిటీ రావాలంటే మాత్రం రేవంత్ మరోసారి నోరు విప్పితేనే సాధ్యమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. చూడాలి. మళ్లీ రేవంత్ ఈ అంశాలపై ఎప్పుడు నోరు విప్పుతారో???

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/bJeE3b

 

Follow Us:
Download App:
  • android
  • ios