Asianet News TeluguAsianet News Telugu

ఏంటీ రామూ... నీ లెక్క తప్పిందేంటీ

సీఎం కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ ఇప్పటివరకు రాష్ట్రంలో 68 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెబుతున్నారు. మరోవైపు టీఎస్ పీయస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఈ ఏడాది 6 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రకటించారు. ఈ రెండింటిలో ఏది నిజం అనేది తెలియడం లేదు. 68 వేల ఉద్యోగాలలో సీఎం కొడుకు, కూతురు, అల్లుడు ఉద్యోగాలను మినహాయిస్తే మిగిలిన 67,997 ఉద్యోగాలను ఎవరికి ఇచ్చారనేది తెలియడం లేదు.

wheres ktrs numbers going wrong

 

సమైక్య రాష్ట్రమైనా.. స్వరాష్ట్రమైనా పాలకుల తీరే అంతా... ఎన్నికల ముందు వరకు ఓటు మల్లన్న.. ఎన్నికైయ్యాక బోడి మల్లన్న...

 

నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి తెలంగాణ సాధించామని పీఠ మెక్కిన టీఆర్ఎస్ ఇప్పుడు నెమ్మదిగా మాట మారుస్తోంది.
 

లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని మేనిఫెస్టోలో ఊదరగొట్టి ఇప్పుడు కాకి లెక్కలతో తప్పించుకోవాలని చూస్తోంది.

 

టీఆర్ఎస్ రెండున్నరేళ్ల పాలనలో లక్ష ఉద్యోగాలలో సగం ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ, ఐటీ మంత్రి, సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అయితే 68 వేల మంది ఇప్పటికే ఉద్యోగాలిచ్చామని ప్రకటించేశారు.

 

అందులో సీఎం కొడుకు, కూతరు, అల్లుడు ఉద్యోగాలను మినహాయిస్తే  మిగిలిన 67, 997 ఉద్యోగాలు ఎవరికిచ్చారో చెప్పాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

 

రెండున్నరేళ్ల పాలనలో ఇప్పటి వరకు ఒక్క డీఎస్సీ నోటిషికేషన్ కూడా విడుదల కాలేదు. పైగా ఇకపై డీఎస్సీ ఉండబోదని చాలా స్పష్టంగా చేప్పేస్తున్నారు.

 

ప్రభుత్వానికి అవసరమైన వ్యవసాయ విస్తరణాధికారి,  అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులు తప్పితే ఇప్పటి వరకు సర్కారు పెద్ద స్థాయిలో ఏ ఉద్యోగులను ప్రత్యక్ష ప్రతిపాదికన నియమించలేదు.

 

మరోవైపు సింగరేణిలో కారుణ్య నియామకాలకు అనుమతినిచ్చిన సర్కారు నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది.

 

ఈ విషయం కాసేపు పక్కనపెడితే, ఈ రోజు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి ఉద్యోగాల నియామకంపై వార్షిక నివేదిక సమర్పించారు. గత ఏడాది (2016) ఆరువేల ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేసామని ఆయన తెలిపారు. కానీ, కేటీఆర్ మాత్రం ఇప్పటికే 68 వేల ఉద్యోగాలిచ్చామని స్పష్టం చేస్తున్నారు.

 

కేవలం టీఎస్ పీయస్సీ ఒక్కటే ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టదనే విషయం తెలిసిందే. కానీ, పోలీసు శాఖ తప్పితే మరే శాఖ కూడా ఇప్పటి వరకు నియామకాల భర్తీకి పూనుకోలేదు.

 

మరీ కేటీఆర్ చెప్పిన 68 వేల ఉద్యోగాలు ఎవరికి దక్కాయనేది తెలియడం లేదు.

 

మంత్రి చెబుతున్న 68 వేల ఉద్యోగాలు కరెక్టా లేక టీఎస్ పీయస్సీ చైర్మన్ చెబుతున్న 6 వేల ఉద్యోగాలు కరెక్టా అనేది  తెలియక నిరుద్యోగులు జుట్టుపీక్కుంటున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios