తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు? ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఈ రెండు ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ అంతటా హాట్ టాపిక్ అయ్యాయి. మరి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారా? ఉంటే అక్కడేం చేస్తున్నారని కూడా చర్చనీయాంశమయ్యాయి. రేవంత్ కదిలికలపై అన్ని రాజకీయ పక్షాలు ఓ కన్నేశాయి.

టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. అయితే కోర్టు పని మీద ఢిల్లీకి వచ్చినట్లు రేవంత్ చెబుతున్నారు. కానీ కోర్టు పనిమీద ఢిల్లీకి వచ్చిన రేవంత్ కోర్టు పని చూసుకుని వెళ్తారా లేక ఇంకేమైనా వ్యవహారాలు చక్కబెట్టుకుంటారా అన్నది హాట్ టాపిక్ అయిపోయింది.

రేవంత్ ఢిల్లీలో ఉన్నరంటే కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీతో భేటీ అవుతారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే రేవంత్ ఈరోజు రాహుల్ ను కలుస్తారా? లేక రేపు కలుస్తారా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఒకవేళ రాహుల్ తో రేవంత్ భేటీ అయిన పక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే తేదీలను ఖరారు చేసుకోవడమే తరువాయి అన్న ప్రచారం జరుగుతున్నది.

గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ ఈ విషయంలో రేవంత్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ... టిడిపి టిఆర్ఎస్ కలిసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే మాత్రం రేవంత్ పార్టీ మారతాడన్న ప్రచారం జోరుగా సాగింది.

కాంగ్రెస్ లో చేరిక వార్తలను ఖండించిన రేవంత్

తాను కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను రేవంత్ రెడ్డి ఖండించారు. టిఆర్ఎస్ నేతలు, మంత్రులు కూలి పని పేరుతో లక్షలకు లక్షలు సంపాదించిన అక్రమ సంపాదనపై సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. టిఆర్ఎస్ నేతలు పార్టీ ఆవిర్భావం సందర్భంగా కూలి పనులు చేసి లక్షలాది రూపాయలు సంపాదించినట్లు రేవంత్ గతకొంతకాలంగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ సిఎస్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసేందుకే ఢిల్లీకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అర్జున్ రెడ్డి హీరోలా బిహేవ్ చేసిన మేడ్చల్ మెడిక ో లు

https://goo.gl/zrDApr