ఉద్యమంలో లేనోళ్లు ఇప్పుడు ఉద్యోగాలని డ్రామాలాడుతున్నరు - ప్రభుత్వ విప్ బాల్క సుమన్
తెలంగాణ ఉద్యమ సమయంలో లేని నాయకులు ఇప్పుడు ఉద్యోగాలంటూ నాటకాలు ఆడుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఏనాడు ఉద్యమంలో కనిపించనోళ్లు ఇప్పుడు ఉద్యోగాలని డ్రామాలాడుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సోమవారం ఆయన విప్ భాను ప్రసాద్, ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, నోముల భగత్ తో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందని అన్నారు. ఈ ఏడు సంవత్సరాల్లో 14 కోట్ల జాబ్‌లు ఇచ్చుంటే.. తెలంగాణకు ఎన్ని ఇచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యోగాల విషయంలో మంత్రి కేటీఆర్ విడుదల చేసిన విధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా బండి సంజయ్ లేఖ విడుదల చేయించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త ఏడాదిలో వేలాది ఉద్యోగాలు భర్తీ చేయాలని చూస్తోందని తెలిపారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌లో అక్కడి ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ లో యువతపై లాఠీ ఛార్జ్ ఘటనత బీజేపీ ప్రభుత్వానిదని అన్నారు.
ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌ను తుక్కు తుక్కుగా ఒడిస్తారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
యువత బీజేపీని నిలదీయాలి..
దేశానికే తలమానికంగా తెలంగాణలో ఉన్న సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించాలని చూస్తూ యువకులకు అన్యాయం చేయాలనుకుంటోందని ఆరోపించారు. బీజేపీ నాయకులు ఎక్కడ కనిపించినా నిలదీయాలని యువతకు సూచించారు. ఆ పార్టీ భరతం పట్టేందుకు తెలంగాణ యువత సిద్ధంగా ఉండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు గుజరాత్ కు నాయకులకు గులాంగిరీ చేస్తున్నారని ఆరోపించారు. వరి కొనుగోలు విషయంలో ప్రవ్నిస్తున్నామనే నిరుద్యోగం పేరిటి కొత్త డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో యువతకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు.. దక్షిణ భారతదేశానికి మొత్తం అన్యాయం చేస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు తరుణ్ చుగ్‌కు సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి లేదని అన్నారు. తెలంగాణ విషయంలో మాట్లాడే ఆయన పంజాబ్‌లో బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయో చెప్పాలని ప్రశ్నించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్.. పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట
పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి ఎక్కడున్నరు..
వరి కొనగోళ్ల విషయంలో పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలో ఆందోళన చేస్తున్నప్పుడు కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారని బాల్క సుమన్ ప్రశ్నించారు. ఆయన బీజేపీకి భయపడుతున్నారని ఆరోపించారు. కానీ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. కేవలం మీడియాలో కనిపించాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు. స
కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు.. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన తరుణ్ చుగ్
బీజేపీ ట్రాప్ లో యువత పడొద్దు - ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
కేంద్రంలో ఉద్యోగాలివ్వని బీజేపీ నాయకులు నిరుద్యోగ దీక్ష చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. కేటీఆర్ అడిగిన ప్రశ్నకు బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని తెలిపారు బీజేపీ రాష్ట్ర నాయకులకు తెలంగాణ అభివృద్ధి కావాలని ఆకాంక్ష ఉంటే పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తేవాలని చెప్పారు. త్వరలోనే తెలంగాణ యువతకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెబుతారని అన్నారు.