కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు.. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన తరుణ్ చుగ్

ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్‌ చుగ్ (Tarun chugh) విమర్శించారు. ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు.  KCR ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు.
 

BJP Leader Tarun chugh Fires On KCR Over unemployment

ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్‌ చుగ్ (Tarun chugh) విమర్శించారు. ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) ఒక్కరోజు నిరుద్యోగ దీక్షకు దిగారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో ఆయన దీక్షకు దిగారు. సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షను బీజపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ప్రారంభించారు. ఈ దీక్షలో బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, విజయశాంతి, స్వామిగౌడ్ తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. KCR ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యువతను కేసీఆర్ మరిచిపోయారని అన్నారు. ఉద్యమ ద్రోహులకు టీఆర్‌ఎస్ పెద్ద పీట వేస్తుందన్నారు. ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  బంగారు తెలంగాణ ఏమైందని ప్రశ్నించారు. 

తొలుత బండి సంజయ్ నిరుద్యోగ దీక్షను ఇందిరాపార్కు వద్ద నిర్వహించాలని భావించారు. అయితే పోలీసుల అనుమతి నిరాకరణతో దీక్ష వేదికను నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మార్చారు. 

‘నిరుద్యోగ దీక్షతో పీఠం కదిలిపోతుందనే భయంతోనే ఈ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారు.  ప్రజాస్వామ్యబద్దంగా చేపడుతున్న దీక్షకు రాకుండా అడ్డుకోవడం కేసీఆర్‌ నియంత, అహంకార పాలనకు నిదర్శనం. ఏళ్ల తరబడి ఉద్యో్గాలు రాక దాదాపు 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్‌ కళ్లకు కనిపించడం లేదు. ఉద్యోగం, ఉపాధి కరవై లక్షలాది మంది యువత అల్లాడుతున్నా కళ్లుండి చూడలేని కబోధిలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మేధావులు, విద్యావేత్తలు, ప్రజాస్వామిక వాదులంతా ఈ చర్యను ముక్తకంఠంతో ఖండించాలి. నిరోద్యగ యువతీ, యువకుల పక్షాన భాజపా చేపడుతున్న నిరుద్యోగ దీక్షకు రాజకీయాలకు అతీతంగా మద్దతివ్వాలని ప్రజాస్వామిక వాదులను కోరుతున్నాను’ అని బండి సంజయ్‌ దీక్షకు  ముందు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios