Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌ను తుక్కు తుక్కుగా ఒడిస్తారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా టీఆర్ఎస్ ను ప్రజలు తుక్కు తుక్కుగా ఓడిస్తారని టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ విషయమై సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు

Uttam Kumar Reddy serious Colmments on TRS
Author
Hyderabad, First Published Dec 27, 2021, 3:53 PM IST

నల్గొండ: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా  టీఆర్ఎస్ ను  ప్రజలు తుక్కు తుక్కుగా ఓడిస్తారని   టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.సోమవారం నాడు Uttam Kumar Reddy మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం Kcr  కుటుంబ పాలనలో బందీ అయిందన్నారు. దేవరకొండలో ఎస్‌ఎల్‌బిసి  ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానన్న  ఇచ్చిన హామీని కేసీఆర్ ఎక్కడ అమలు చేశారని ఆయన ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు దోబుచూలాడుతున్నాయని ఆయన విమర్శించారు.

also read:యాటవడ్డంక కుప్పలో భాగం అడిగేటోళ్లు కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు - మంత్రి నిరంజన్ రెడ్డి

 Kaleshwaram project పేరుతో ప్రజాధనాన్ని దోపిడీ చేశారని ఆయన  ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.  యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా మరో ఉద్యమానికి నాంది పలకాలన్నారు. డబ్బులు తీసుకొని పోస్టింగులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ శాఖను చెప్పు చేతల్లో పెట్టుకొని అరాచకాలకు పాల్పడుతోందని ఉత్తమ్‌ ఆరోపించారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్

ఎర్రవల్లిలో రచ్చబండ నిర్వహించేందుకు వెళ్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నాడు  తన ఇంటి నుండి ఎర్రవల్లికి వెళ్లేందుకు ప్రయత్నించిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అంబర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ ను పలువురు కాంగ్రెస్ నేతలు ఖండించారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు కీలకమైన కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

మరోవైపు Revanth reddy ఎర్రవల్లి రచ్చబండ కార్యక్రమానికి సంబంధించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి సమాచారం లేకపోవడం ఆ పార్టీలో చర్చకు దారి తీసింది. జగ్గారెడ్డికి సమాచారం ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు తప్పుబట్టారు.ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డిని అంబర్ పేట పోలీస్ స్టేషన్ కు తీఃసుకొచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అంబర్ పేట-దిల్ సుఖ్ నగర్ రోడ్డుపై  బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. 

.


 

Follow Us:
Download App:
  • android
  • ios