అసెంబ్లీకి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మందు తాగి వచ్చారని టిఆర్ఎస్ శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని కడిగి పారేశారు. సహచర కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డితో కలిసి కోమటిరెడ్డి మీడియాపాయింట్ లో మాట్లాడారు. కోమటిరెడ్డి ఏమన్నారంటే..?

పల్లా రాజేశ్వర్ రెడ్డి పెద్ద అవినీతిపరుడు. ప్రయివేటు కాలేజీ పెట్టి విద్యావేత్త అని చెప్పుకుంటాడు. అసలు పల్లా ఎమ్మెల్సీగా ఏమాత్రం పనికిరాడు. నీకు, నీ ముఖ్యమంత్రి కేసిఆర్ కు దమ్ముంటే మీ ఎమ్మెల్యేలను తీసుకురా, ముఖ్యమంత్రిని తీసుకురా. మేమూ వస్తాం. అసెంబ్లీలో డాక్టర్లు కూడా ఉన్నారు కదా? పరీక్షలు జరిపిద్దాం. ఎవరు తాగొచ్చిర్రో బయటపడతది. పల్లా రాజేశ్వర్ రెడ్డికి కొంచెమైనా సిగ్గుండాలె చిల్లర మాటలు మాట్లాడడానికి. మీ సిఎం ను పక్కన పెట్టుకుని కాంగ్రెసోళ్లు తాగుబోతులు అంటారా?

తాగుడు గురించి మాకు చెబుతున్నవా? ఫామ్ హౌస్, ప్రగతి భవన్ పూటకో ఇల్లు గురించి మాకు తెల్వదా? మీ ముఖ్యమంత్రిని ఒప్పించి తీసుకురా ఆల్కహాల్ టెస్ట్ పెడదాము.. ఎవరి బాడీలో ఆల్కహాల్ ఉందో తేలిపోతది. కేసిఆర్ ను మీ వెంట పెట్టుకుని మమ్మల్ని తాగుబోతు అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. కేసిఆర్ తన సంఘమంతా తుగుబోతులే ఉన్నరని అసెంబ్లీని 11 గంటలకు పెట్టిండు. తాగుడు మీద 20వేల కోట్ల ఆదాయం వస్తున్నది. కేసిఆర్ కు తాగుడంటే అంత ఇష్టం కాబట్టి తాగుడు పెంచి పోశించి తెలంగాణను నాశనం చేస్తున్నడు.