డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. నిందితులను ఉరి తీయాలంటూ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సైతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా చేరారు.

Also Read:డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య: రాజకీయనేతలను అడ్డుకొన్న కాలనీవాసులు

ఆ క్రమంలో ఆయన ఆదివారం ప్రధాని నరేంద్రమోడీకి ట్వీట్ చేశారు. నిర్భయ ఘటనలో నిందితులకు ఏడేళ్లైనా ఉరిపడలేదని.. తొమ్మిదేళ్ల చిన్నారి ఘటనలోనూ నిందితులకు ఉరిశిక్షను హైకోర్టు జీవితఖైదుగా మార్చిందని కేటీఆర్ గుర్తుచేశారు.

నేరం చేయాలంటేనే భయపడేలా కఠిన శిక్షలు విధించాలని, రేపిస్టులకు అప్పీలుకు అవకాశాం లేకుండా ఉరిశిక్ష విధించాలని మంత్రి డిమాండ్ చేశారు. అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలు సవరించాలని, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టాన్ని ఆమోదించాలని కేటీఆర్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

చర్లపల్లి జైలు వద్ద ఉన్న డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో  ఉన్న నిందితులను తమకు అప్పగించాలని యువకులు ఆదివారం నాడు ఆందోళనకు దిగారు. దీంతో  ఉద్రిక్తత నెలకొంది. చర్లపల్లి జైలు వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

డాక్టర్ ప్రియాంక రెడ్డిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్య చేసిన నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు నవంబర్ 30వ తేదీన తరలించారు. ఆదివారం నాడు  ఉదయం న్యాయవాదులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున చర్లపల్లి జైలు వద్దకు చేరుకొన్నారు.

డాక్టర్ ప్రియాంక రెడ్డిని హత్య చేసిన నిందితులను అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చర్లపల్లి జైలు ముందు వాళ్లంతా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.చర్లపల్లి జైలు గేటు నుండి లోపలికి వెళ్లేందుకు వాళ్లంతా ప్రయత్నించారు. జైలు అధికారులు నిరసనకారులను అడ్డుకొన్నారు.

Also Read:డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య: నిందితులు ముందే దొరికినా వదిలేశారు

చర్లపల్లి జైలు వద్దకు సాధారణ పోలీసులు భారీగా మోహరించారు. చర్లపల్లి జైలు వద్ద మహిళ సంఘాలు, న్యాయవాదులు, యువకులు బైక్‌లపై ర్యాలీగా వచ్చారు. డాక్టర్ ప్రియాంక రెడ్డి ఫోటోలు ఉన్న ప్ల కార్డులను చేతిలో పట్టుకొని  నిరసన వ్యక్తం చేశారు.