Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ సమైక్యత ఉద్యమంలో బీజేపీ రోల్ ఏంటి ? - ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. భారత స్వతంత్ర ఉద్యమంలో అలాగే హైదరాబాద్ స‌మైక్య‌త ఉద్య‌మంలో బీజేపీ ఎలాంటి పాత్ర పోషించిందని అన్నారు. 

What is the role of BJP in the Hyderabad integration movement? - MLC Kalvakuntla kavitha
Author
First Published Sep 17, 2022, 1:11 PM IST

భార‌త స్వ‌తంత్ర పోరాటంలో, హైద‌రాబాద్ స‌మైక్య‌త ఉద్య‌మంలో బీజేపీ ఎలాంటి పాత్ర పోషించింద‌ని ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత ప్ర‌శ్నించారు. నేడు (శ‌నివారం) కేంద్ర హోం మంత్రి హైదరాబాద్ లో ఉన్న నేపథ్యంలో త‌న ప్ర‌శ్న‌కు ఆయ‌న‌, బీజేపీ నేత‌లు స‌మాధానం చెప్పాల‌ని అన్నారు. ఈ మేర‌కు ఆమె శ‌నివారం ఉద‌యం త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. 

కూనో నేషనల్ పార్క్‌లో చీతాలను విడుదల చేసిన ప్రధాని మోదీ..

బీజేపీ నేత‌ల‌కు అలవాటైన ‘‘ఎన్నికల ఉత్సవాలు’’ అనే సహజ సూత్రం ఆధారంగా రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను హైజాక్ చేయడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాలకు వచ్చి హామీలివ్వడం, ప్రజలు వారిని తిరస్కరించగానే, వంచించడం బీజేపీ కి అల‌వాటే అని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు.

తెలంగాణ బిడ్డగా, త‌న ప్ర‌శ్న‌ల‌కు సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాన‌ని ఆమె పేర్కొన్నారు. దేశంలో ప్రజలకు హక్కులు కలిపించడానికి బీజేపి చేసిందేమీ లేద‌ని ఎమ్మెల్సీ క‌విత తెలిపారు. సామరస్యం, ఏకత్వం, ప్రజా బలం, ఇవే సీఎం కేసీఆర్ కు, తెలంగాణ‌కు పునాది అని చెప్పారు. తెలంగాణ అస్తిత్వం కోసం ఎప్పుడూ పోరాటం చేసే సీఎం కెసీఆర్ కు కృతజ్ఞతల‌ను అని ఆమె తెలిపారు. 

పటేల్ కృషితో నిజాం పాలన నుంచి విముక్తి.. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయి: అమిత్ షా

ఆమె మ‌రో ట్వీట్ లో.. రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలన వైపు అడుగులేసిన తెలంగాణ నేడు సమైక్యతా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలని తెలిపారు. స్వరాష్ట్రంగా మారి సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రగతి పథంలో పయనిస్తూ దేశంలో నంబర్ వన్ గా మారిందని పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తోందని ఆమె తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను సన్మానిస్తూ.. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ జాతీయ సమైక్యత, సమగ్రత ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించుకోవడం కేవలం సీఎం కేసీఆర్ విశాల దృక్పథం వల్లే సాధ్యమైంద‌ని ఆమె ట్వీట్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios