నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విడుదల చేశారు. అనంతరం మోదీ వాటిని ఫొటోలు తీశారు.

నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విడుదల చేశారు. చీతా ప్రాజెక్టులో భాగంగా ఈ చీతాలను నమీబియా నుంచి కేంద్రం భారత్‌కు 8 చిరుతలను తీసుకొచ్చింది. తన జన్మదిన సందర్బంగా ప్రధాని మోదీ వాటిని నేడు కూనో నేషనల్‌ పార్క్‌లో రెండు చీతాలను ఎన్‌క్లోజర్ల నుంచి విడుదల చేశారు. అనంతరం మోదీ వాటిని ఫొటోలు తీశారు. తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 1952లో దేశం నుంచి చీతాలు అంతరించిపోయాయని ప్రకటించడం దురుదృష్టకరమని చెప్పారు. అయితే దశాబ్దాలుగా వాటికి పునరావాసం కల్పించడానికి ఎటువంటి అర్ధవంతమైన ప్రయత్నం జరగలేదని చెప్పారు. 

1952లో దేశం నుంచి చీతాలు అంతరించిపోయాయని మేము ప్రకటించడం దురదృష్టకరం, కానీ దశాబ్దాలుగా వాటికి పునరావాసం కల్పించడానికి ఎటువంటి అర్ధవంతమైన ప్రయత్నం జరగలేదు. నేడు మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నందున.. దేశం కొత్త శక్తితో చీతాలకు పునరావాసం కల్పించడం ప్రారంభించిందని మోదీ తెలిపారు. కునో నేషనల్ పార్క్‌లో ఈ చీతాలకు చూడడానికి ప్రజలు ఓపిక పట్టాలి అన్నారు. కొన్ని నెలలు వేచి ఉండాలని కోరారు. 

‘‘ఈ చీతాలు ఈ ప్రాంతానికి తెలియకుండానే అతిథులుగా వచ్చాయి. అవి కునో నేషనల్ పార్క్‌ను తమ నివాసంగా మార్చుకోవడానికి.. మనం ఈ చిరుతలకు కొన్ని నెలల సమయం ఇవ్వాలి. అంతర్జాతీయ మార్గదర్శకాలను అనుసరించి.. ఈ చీతాలు సెటిల్ అవ్వడానికి భారతదేశం తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మన ప్రయత్నాలు విఫలం కాకూడదు’’ అని మోదీ అన్నారు.