విపక్షాలను చిత్తు చేసిన టీఆర్ఎస్‌: బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితి ఇదీ...

తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలను టీఆర్ఎస్ చిత్తు చేసింది. కాంగ్రెస్, బీజేపీలు మున్సిపల్ ఎన్నికల్లో సింగిల్ డిజిట్స్ కే పరిమితమయ్యాయి.

TRS crushes oppn, emerges stronger

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఏ పార్టీ ప్రత్యామ్నాయం కాదని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. 

తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ, కాంగ్రెస్ లు  ప్రజలకు వివరిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు మాత్రం టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాదని  మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.

Also read:నేను గాయత్రీ మంత్రం చదువుతా, బిజెపి చెప్తేనేనా: కేసీఆర్

ఎన్నికల ప్రచారంలో ఈ రెండు పార్టీలు అధికార పార్లీకి తామే ప్రత్యామ్నాయం అంటూ చేసిన ప్రసంగాలను ప్రజలు పట్టించుకోలేదు. ఈ రెండు పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో కనీసం డబుల్ డిజిట్ స్థానాలను కూడ గెలుచుకోలేకపోయాయి.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీఆర్ఎస్ మరోసారి షాక్ ఇచ్చింది. గత ఏడాది చివర్లో జరిగిన  హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఈ స్థానంలో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించింది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకొన్నారు. ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే హుజూర్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో కూడ వచ్చాయి.

హుజూర్ నగర్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకొంది. ఈ పట్టణంలోని 28 వార్డుల్లో టీఆర్ఎస్ 21 వార్డులను కైవసం చేసుకొంది. కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొడంగల్ మున్సిపాలిటీలో  టీఆర్ఎస్‌ 10 వార్డులను కైవసం చేసుకొంది. కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు కౌన్సిలర్లు టీఆర్ఎస్ వైపు చేరారు.

మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క , మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు కూడ తమ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీల్లో విజయం సాధించలేకపోయారు.

శ్రీధర్ బాబు నియోజకవర్గంలోని మంథని, జగ్గారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగారెడ్డి,  భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిరలో  టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 6 మున్సిపాలిటీలను కైవసం చేసుకొనే అవకాశం ఉంది. అయితే ఎక్స్‌అఫిషీయో సభ్యుల సహాకారం ఉంది.

మున్సిపాలిటీలతో పోలిస్తే కార్పోరేషన్లలో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించింది. నిజామాబాద్, ఆదిలాబాద్ లలో టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటిని ఇచ్చింది.

మున్సిపాలిటీల్లో బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ మెరుగైన ఫలితాలను సాధించింది. 10 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క వార్డులో కూడ విజయం సాధించలేదు.  40 మున్సిపాలిటీల్లో బీజేపీ ఒక్క వార్డును కూడ గెలుచుకోలేదు. రాష్ట్రంలోని 10 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు తన పట్టును నిరూపించుకొన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ గెలుచుకొంది. సంగారెడ్డిలో టీఆర్ఎస్ గెలవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ చేశారు. దీంతో ఈ మున్సిపాలిటీపై హరీష్ రావు కేంద్రీకరించారు. సంగారెడ్డి, సదాశివపేటతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో కూడ టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios