హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె విషయంలో  హైకోర్టు విచారణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాంపై ఆర్టీసీ జేఎసీ శుక్రవారం నాడు  ఉదయం సమావేశం కానుంది. హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించే నివేదిక ఆధారంగా ఆర్టీసీ జేఎసీ కార్యాచరణను అనుసరించాలని భావిస్తోంది.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె నిర్వహిస్తున్నారు. సమ్మె చేస్తున్నా కార్మికులు సెల్ప్ డిస్మిస్ అయ్యారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో  కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు.

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చల విషయమై ప్రభుత్వం సానుకూలంగా లేదు. చర్చల విషయంలో ప్రభుత్వం ముందడగు వేయడం లేదు. ఈ తరుణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో శుక్రవారం నాడు విచారణ జరగనుంది.

ఈ విచారణకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పనుందోననే ఆసక్తి ఆర్టీసీ జేఎసీ నేతల్లో నెలకొంది. వరుసగా రెండు రోజుల పాటు ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఆర్టీసీ అధికారులు, రవాణశాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొన్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తదితర విషయాలపై చర్చించారు.

ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లడానికి కారణాలు ఏమిటనే విషయమై కూడ అధికారులతో సీఎం చర్చించారు. హైకోర్టులో ఏం చెప్పాలనే విషయమై కూడ సీఎం కేసీఆర్ అధికారులకు సూచనలు చేశారు. ఈ తరుణంలో  హైకోర్టులో ప్రభుత్వం ఏం చెప్పనుందనే విషయమై ఆర్టీసీ జేఎసీతో పాటు టీఆర్ఎస్ మినహా ఇతర రాజకీయపార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఆర్టీసీ సమ్మె విషయమై చర్చలకు తాను సానుకూలంగా ఉన్నానని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు ప్రకటించారు. ఈ తరుణంలో  కేశవరావు మూడు రోజులుగా సీఎం అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూశాడు. గురువారం నాడు ఆర్టీసీ సమ్మె విషయమై మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఆర్టీసీ అధికారులతో చర్చల సందర్భంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీ కేశవరావును కూడ ఆహ్వానించారు.

వెనక్కి తగ్గని కేసీఆర్: తమిళిసై చేతిలో అస్త్రం, వ్యూహాత్మకంగా కాంగ్రెస్

ఆర్టీసీ సమ్మె విషయమై చోటు చేసుకొన్న పరిణామాలను సీఎం కేసీఆర్ కేశవరావుకు వివరించారు. అయితే  ఆర్టీసీ సమ్మె విషయమై గురువారంనాడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు.

రాష్ట్ర రవానా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గురువారం నాడు ఫోన్ చేశారు. ఆర్టీసీ సమ్మెపై ఆరా తీశారు. రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ కూడ గురువారం నాడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో సమావేశమై ఆర్టీసీ సమ్మె గురించి వివరించారు. 

ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా: కేసీఆర్‌పై ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న కార్మికులను ఉద్యోగాలనుండి తొలగించిన విషయమై గవర్నర్ ఆరా తీసినట్టుగా సమాచారం. సెల్ప్ డిస్మిస్ అయినట్టుగా ప్రభుత్వం ప్రకటించిన విషయమై గవర్నర్ రవాణా శాఖ కార్యదర్శిని ప్రశ్నించారని సమాచారం.

RTC Strike: చట్టాల్లో సెల్ప్ డిస్మిస్ ఉందా? ఆరా తీసిన తమిళిసై

జీతాలతో పాటు ఆర్టీసీ కార్మికులతో చర్చల విషయమై రెండు రోజుల క్రితం హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం నాడు తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణలో కోర్టు ఏం చెప్పనుంది. కోర్టుకు ప్రభుత్వం ఏం చెప్పనుందోననే ఆసక్తి నెలకొంది.