హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయమై రవాణా శాఖ కార్యదర్శితో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమీక్షించారు. ఆర్టీసీ సమ్మె విషయమై అసలేం జరుగుతోందని ఆమె రవాణ శాఖ కార్యదర్శిని ప్రశ్నించారు.

గురువారం నాడు మధ్యాహ్నాం ఆర్టీసీ సమ్మె విషయమై తమిళనాడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేశారు. ఆర్టీసీ సమ్మె గురించి ఆరా తీశారు. దీంతో మంత్రి అజయ్ కుమార్ ఆర్టీసీ సమ్మె విషయమై ప్రభుత్వం తీసుకొన్న చర్యలను వివరించేందుకు రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మను గవర్నర్ వద్దకు పంపారు.

కార్మిక చట్టాల్లో సెల్ప్ డిస్మిస్ అనే పదం ఉందా అని కూడ ఆమె ప్రశ్నించారని సమాచారం. ఆ పదం లేకుండా 48వేల మంది కార్మికులను తొలగిపోయారని ఎలా చెబుతారని గవర్నర్ రవాణాశాఖ కార్యదర్శిని  అడిగారని సమాచారం. ఆర్టీసీ జేఎసీ సమ్మెకు పిలుపునిచ్చిన పరిస్థితులను గురించి గవర్నర్ తెలుసుకొన్నారు.

ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా: కేసీఆర్‌పై ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆర్టీసీ జేఎసీ నేతలు, బీజేపీ నేతలు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసి ఆర్టీసీ సమ్మె విషయమై ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల క్రితం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ నుండి వచ్చిన గవర్నర్ ఆర్టీసీ సమ్మెపై కేంద్రీకరించారు.

ఆర్టీసీ సమ్మె విషయమై శుక్రవారం నాడు (అక్టోబర్ 18) హైకోర్టులో విచారణ ఉంది. చర్చల విషయమై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ సమ్మె విషయమై చర్చల దిశగా ప్రభుత్వం ఆలోచన కన్పించడం లేదు.సమ్మె విషయమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దిశగానే ప్రభుత్వం చర్యలు ఉన్నాయి.

వెనక్కి తగ్గని కేసీఆర్: తమిళిసై చేతిలో అస్త్రం, వ్యూహాత్మకంగా కాంగ్రెస్

ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ రకమైన చర్యలు తీసుకొన్నారనే విషయమై కూడ గవర్నర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను, రవాణా శాఖ కార్యదర్శిని  ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది.

ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వివరించారు. ప్రైవేట్ బస్సులు, రోజూ వారీ కార్మికులతో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్టుగా సునీల్ శర్మ గవర్నర్ కు వివరించారు.

rtc strike: కేసీఆర్ ప్రభుత్వంపై ఆశ్వాత్థామ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి  సమ్మె చేస్తున్నారు.  సమ్మె చేస్తున్న ఆర్టీసీ కాార్మికులతో చర్చల ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ ప్రకటించారు.బుధవారం సాయంత్రం నుండి రాత్రి వరకు, గురువారం నాడు మధ్యాహ్నం నుండి రాత్రివరకు సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మె విషయమై అధికారులతో చర్చించారు.

ఆర్టీసీ సమ్మె విషయమై ఇవాళ కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో కోర్టుకు ఏం చెప్పాలనే విషయమై సీఎం కేసీఆర్ అధికారులతో సుధీర్ఘంగా చర్చించినట్టుగా సమాచారం. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొన్న ప్రత్యామ్నాయ చర్యల గురించి కూడ రవాణ కార్యదర్శి గవర్నర్ కు వివరించారు. ఆర్టీసీ నష్టాలు ఇతర విషయాలను కూడ ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.