సుజాతానగర్ లో బిజెపి నేతల నిర్వాకం జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేసిన నేతలు

ఖమ్మం జిల్లా బిజెపి నేతలకు కోపమొచ్చిందా? లేక ఇంకేమైనా అయిందా అన్న అనుమానాలు జనాల్లో కలుగుతున్నాయి. ఎందుకంటే వాళ్లు తెలంగాణ విమోచన పేరుతో చేపట్టిన కార్యక్రమంలో అపశృతి దొర్లింది. ఇది అపశృతి నా లేక ఇంకేమైనా అయిందా అన్నది తెలియడంలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

తెలంగాణ విమోచన దినోత్సవంగా సెప్టెంబరు 17న జరపాలని తెలంగాణ బిజెపి కాలుకు బలపం కట్టుకుని తిరిగింది. ఊరు వాడ ప్రచారం చేసి తెలంగాణ సర్కారును ఇరకాటంలో పడేసింది. ఈ విషయంలో తెలంగాణ బిజెపి యావత్ శ్రేణులన్నీ కదిలాయి.

కానీ ఖమ్మం జిల్లాలోని సుజా నగర్ లో తెలంగాణ విమోచన దినము సందర్భంగా బిజెపి ఆద్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. కానీ వారు ఆ జెండాను తలక్రిందులుగా ఎగురవేయడం విమర్శలకు తావిస్తోంది. సుజాతానగర్ బిజెపి నేతల తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

<!-- You're using demo endpoint of Iframely API commercially. Max-width is limited to 320px. Please get your own API key at https://iframely.com. -->ఏషియానెట్-తెలుగు క్రైమ్ న్యూస్