Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్ స్టూడెంట్ల విషయంలో ఏం చేద్దాం.. తెలంగాణ సీఎంవో సమాలోచనలు..

ఇంటర్ ఫలితాలపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం ఆఫీస్ రంగంలోకి దిగింది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని ఆలోచనలు జరుపుతోంది.

What can we do about inter students .. Telangana CMVO consultations ..
Author
Hyderabad, First Published Dec 19, 2021, 10:58 AM IST

తెలంగాణ‌లో ఇంట‌ర్ ఫ‌లితాలు నిరాశ‌ప‌ర్చాయి. బాగా చ‌దివే స్టూడెంట్లు కూడా ఈ సారి ఫెయిల్ కావ‌డంతో తెలంగాణ విద్యాశాఖపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గ‌త మూడు రోజులుగా ఆందోళ‌లు ఆగ‌డం లేదు. స్టూడెంట్ల తల్లిదండ్రులు కూడా ఈ విష‌యంలో ప్ర‌భుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ సీఎం ఆఫీస్ రంగంలోకి దిగింది. ఏం చేస్తే విద్యార్థుల‌ను శాంతింప‌జేయ‌వ‌చ్చ‌నే అంశంపై ఆలోచ‌న‌లు చేస్తోంది. ఇంట‌ర్ ఫ‌లితాల విష‌యం ఏం చేయాల‌ని స‌మాలోచ‌న‌లు చేస్తోంది. 

ఇత‌ర రాష్ట్రాలు ఏం చేశాయి ? 
గ‌త కొన్నేళ్ల‌లో ఇంట‌ర్ ఫ‌లితాలు మ‌రీ ఇంత దారుణంగా ఎప్పుడు రాలేదు. గ‌తేడాది కంటే ఈ ఏడాది ఏకంగా 11 శాతం ఉత్తీర్ణ‌త త‌గ్గింది. ప‌రీక్ష రాసిన విద్యార్థుల్లో స‌గం కంటే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. కేవలం 49 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. బాగా చ‌దివే విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారు. పాస్ అయిన విద్యార్థుల్లో చాలా మంది బార్డ‌ర్ మార్కుల‌పైనే గ‌ట్టెక్కారు. ఈ సారి ఒక్క విద్యార్థి కూడా వంద శాతం మార్కులు సాధించ‌లేదు. ఎప్పుడూ టాప‌ర్లుగా నిలిచేవారు ఈ సారి బొటా బొటీ మార్కుల‌తో స‌రిపెట్టుకున్నారు. లాక్ డౌన్‌, ఆన్‌లైన్ క్లాసులు, సిల‌బ‌స్ పూర్తికాక‌పోవ‌డం ఇవ్వ‌న్నీ ఇంట‌ర్ ఫ‌లితాలు ఇలా రావ‌డానికి కార‌ణాలు. ఈ విష‌యం ప్ర‌భుత్వానికి కూడా తెలుసు. అందుకే స్టూడెంట్ల విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాల‌నే ఆలోచ‌న జ‌రుపుతోంది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్న నేప‌థ్యంలో సీఎం ఆఫీస్ రంగంలోకి దిగింది. 
ఇంట‌ర్ ప‌రీక్ష‌లు, ఫ‌లితాలు విష‌యంలో ఇత‌ర రాష్ట్రాలు ఎలాంటి ప‌ద్ద‌తుల‌ను అవ‌లంభించాయి. స‌మ‌స్యలు రాకుండా ఎలా ముందుకెళ్లారు. ఏం చేస్తే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌వ‌చ్చనే విష‌యంలో దృష్టి పెట్టింది. దాని కోసం అన్ని రాష్ట్రాల నుంచి నివేదిక‌లు తెప్పించుకుంటున్నాయి. న్యాయ స‌మ‌స్య‌లు రాకుండా, స్డూండెంట్ల‌కు భ‌విష్య‌త్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎలా ముందుకెళ్లాలి అని ఆలోచిస్తుంది. 

వ‌ణికిస్తోన్న చ‌లిపులి.. రికార్డుస్థాయిలో ప‌డిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు.. నగరంలో యెల్లో అలర్ట్..

ఏపీలో ఎదురుకాని ‘ఇంట‌ర్’ స‌మ‌స్య‌
ఏపీలో ఇంట‌ర్ ఫలితాల విష‌యంలో ఎలాంటి స‌మ‌స్య త‌లెత్త‌లేదు. తెలంగాణ ప్ర‌భుత్వం ఇక్క‌డి ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ స్టూడెంట్ల‌ను ప్ర‌మోట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిది కానీ ఏపీలో అలా జ‌ర‌గ‌లేదు. కేవ‌లం ఆల్ పాస్ అని ప్ర‌క‌టింది. త‌రువాత ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక ఇంప్రూవ్‌మెంట్ పేరుతో ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. దీంతో అంద‌రు స్టూడెంట్లు ప‌రీక్ష‌లు రాశారు. ఈ ప‌రీక్ష‌ల్లో మార్కులు ఎక్కువ వ‌చ్చిన స్టూడెంట్ల‌కు  మెమోల‌పై మార్కులు క‌లిపారు. ఫెయిలైన స్టూడెంట్ల‌కు మాత్రం పాత మార్కుల‌నే ఉంచి పాస్ చేశారు. ఇలా అక్క‌డ ఎలాంటి స‌మ‌స్య ఎదురుకాలేదు. అందుకే అక్క‌డ ఎలాంటి ఆందోళ‌న‌లు జ‌ర‌గ‌లేదు. తెలంగాణ ప్ర‌భుత్వం ఏపీ నుంచి కూడా నివేదిక‌లు తెప్పించుకున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే ఇత‌ర రాష్ట్రాల్లో ఇంకా దీని కంటే మెరుగైన ఫ‌లితాల‌ను అవ‌లంభించారా అనే కోణంలోనూ సీఎంవో అన్వేష‌ణ సాగిస్తోంది. 

త‌గ్గ‌ని ఆందోళ‌న‌లు..
ఇంట‌ర్ ఫ‌లితాల‌పై ఇంకా ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత ఇద్ద‌రు స్టూడెంట్లు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డంతో ఈ నిర‌స‌న‌లు మ‌రింతగా పెరిగాయి. విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్‌, తెలంగాణ విద్యార్థి సంఘం, ఏబీవీపీ నాయకులు శ‌నివారం ఇంట‌ర్ బోర్డు కార్యాల‌యం ఎదుట ఆందోళ‌న నిర్వ‌హించారు. ఇంట‌ర్ స్టూడెంట్లంద‌రినీ పాస్ చేయాల‌ని డిమాండ్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios