దళిత, గిరిజనుల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం.. బీఆర్ఎస్ పై డాక్టర్ కోట నీలిమ ఫైర్
Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన ఆరు హామీలు దళిత, గిరిజనుల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తాయని సనత్ నగర్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ ఆశాభావం వ్యక్తం చేశారు.
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తోంది. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులందరూ కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలను గురించి వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నీలిమ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎత్తిచూపుతూ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మెరుగైన కాంగ్రెస్ అందిస్తుందని తెలిపారు. దళిత గిరిజనుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని డాక్టర్ కోట నీలిమ ఉద్ఘాటించారు. అమీర్‌పేట్ డివిజన్‌లోని బాపునగర్ బస్తీలో ఇంటింటి ప్రచారం సందర్భంగా ఆమె నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో స్థానిక నాయకులు ఎదుర్కొంటున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు.
గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలోని భౄరత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సర్కారు విఫలమైందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన ఆరు హామీలు దళిత గిరిజనుల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తాయని డాక్టర్ కోట నీలిమ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30 ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు ఉండనుంది. అయితే, ప్రస్తుత రాజకీయ పరిణామాలు గమనిస్తే బీఆర్ఎస్-కాంగ్రెస్ ల మధ్య గట్టి పోటీ వుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.