Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణకు వర్ష సూచన.. ఆ జిల్లాల్లో తేలికపాటి వర్షం..

తెలంగాణ నుంచి ఉత్తర తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి మంగళవారం బలహీనపడింది. ఈరోజు ఉపరితల ద్రోణి సముద్రమట్టం నుండి0.9  కిలోమీటర్ల వరకు ఇంటీరియర్ తమిళనాడు నుండి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా మరట్వాడ వరకు ఏర్పడింది.

weather report : rain forecast for telangana districts - bsb
Author
Hyderabad, First Published Apr 6, 2021, 4:00 PM IST

తెలంగాణ నుంచి ఉత్తర తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి మంగళవారం బలహీనపడింది. ఈరోజు ఉపరితల ద్రోణి సముద్రమట్టం నుండి0.9  కిలోమీటర్ల వరకు ఇంటీరియర్ తమిళనాడు నుండి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా మరట్వాడ వరకు ఏర్పడింది.

మంగళవారం ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ తెలంగాణ, నైరుతి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 1,2 ప్రదేశాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. 

మిగతా జిల్లాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు ఎల్లుండి అంటే 7, 8 తేదీల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
 
Follow Us:
Download App:
  • android
  • ios