5 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని అన్ని జలాశయాలు నిండుకుండలా మారాయి. అయితే ఇలాగే మరో మూడు రోజుల పాటు వానలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా వాగులు పొంగి పొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో బ్రిడ్జీలపై నుంచి నీళ్లు పారుతున్నాయి. చాలా చోట్ల రవాణా సౌకర్యం నిలిచిపోయింది. ఉత్తర తెలంగాణలో మంగళశారం నుంచి ఎడ తెరపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. అయితే మరో మూడు రోజలు పాటు రాష్ట్రంలో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అంచనా వేసింది.
సెంట్రల్ జైలు నుంచి పారిపోవాలని గోడ దగ్గరి చెట్టు ఎక్కాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అలాగే జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు మంగళశారం సాయంత్రం ఒక బులిటిన్ విడుదల చేసింది.
గర్భ నిరోధకాలను ముస్లింలే ఎక్కువ వాడుతున్నారు: యోగి ఆదిత్యానాథ్‌పై అసదుద్దీన్ ఫైర్
కాగా.. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాయంత్రం నాటికి కుమురం భీమ్‌లోని జైనూరులో అత్యధికంగా 17.9 సెంటీమీటర్లు, కరీంనగర్‌లోని ఆర్నకొండలో 17.8 సెంటీమీటర్లు, పెద్దపల్లి జిల్లా కనుకులలో 117.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కర్ణాటకలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులోకి స్థిరమైన ఇన్‌ఫ్లోలు వస్తున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి దిగువకు జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు.
రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి, ఫలితంగా గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టులలోకి గణనీయమైన ఇన్‌ఫ్లోలు వస్తున్నాయి. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు నిరంతరం ఇన్ ఫ్లో వస్తుండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.కాగా.. మంగళవారం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పగటి ఉష్ణోగ్రత 23.9 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయింది, బుధవారం కూడా వర్షం కొనసాగవచ్చని ఐఎండీ బులిటెన్ పేర్కొంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుతుబుల్లాపూర్‌లో తేలికపాటి నుండి మోస్తరు నుండి భారీ వర్షం, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది, ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 27-30 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 20-23 డిగ్రీల సెల్సియస్ గా ఉండవచ్చు.
