హైద్రాబాద్‌లో ఈదురుగాలులతో 12 గంటలపాటు వర్షాలు: అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచన
జీహెచ్ఎంసీ పరిధిలో మరో 12 గంటల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా జీహెచ్ఎంసీ ప్రజలను కోరింది.
హైదరాబాద్: GHMC పరిధిలో మరో 12 గంటల పాటు ఈదురుగాలులతో కూడిన Rain కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఐదు రోజులుగా Hyderabad నరంలో వర్షాలు కురుస్తున్నాయి.
ఇవాళ మధ్యాహ్నం నుండి నగర వ్యాప్తంగా ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఎవరూ ఉండొద్దని కూడా అధికారులు కోరుతున్నారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు.
గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖాధికారులు హెచ్చరించారు. ఈదురు గాలుల కారణంగా చెట్ల కొమ్మలు, ఫ్లెక్సీల, హౌర్డింగ్ లు కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. వాహనదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మెట్రో పిల్లర్లపై ఉన్న ఎల్‌ఈడీ ప్కీర్లను కూడా అధికారులు తొలగించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 40 బృందాలు పనిచేస్తున్నాయి.
వర్షం, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ బృందాలు పనిచేస్తున్నాయి. హైద్రాబాద్ నగరంలోని పలు చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఈ ఐదు రోజులుగా నగర వ్యాప్తంగా సగటున 9.5 సెం.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
నిన్న రాత్రి నుండి కుత్బుల్లాపూర్ లో 3.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. హైద్రాబాద్ నగరంలో ఉన్న అతి పెద్ద జాతీయ జెండాను తొలగించారు. . ఈదురు గాలులు 50 కి.మీ వేగంతో వీచే అవకాాశం ఉన్నందున జాతీయ జెండాకు ఇబ్బంది కలగకుండా ఉండేందుు జాతీయజెండాను తొలగించినట్టుగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ చెప్పారు.,
హైద్రాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్,హిమాయత్ నగర్ లకు వరద కొనసాగుతుంది. నగరంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు
రాష్ట్రంలోని విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఆది, సోమ వారాల్లో వర్షాలపై కేసీఆర్ అధికారులు, మంత్రులను ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంంగా ఉండాలని సూచించారు.గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి,వరద పరిస్థితిని కూడా సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.
also read:తెలంగాణలో కొనసాగుతున్న వర్షాలు.. ఏపీలో 5 జిల్లాలకు హై అలెర్ట్
హైద్రాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.హైద్రాబాద్ సహా కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. వరద నీరు చేరిన ప్రాంతాల్లో సమాయక చర్యలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేపట్టనున్నాయి.