తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానల వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే ఏపీలోని 5 జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం హై అలెర్ట్ ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 347 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరపడి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ అసౌకర్యం ఏర్పడింది. హైదరాబాద్ లో కూడా భారీగా వర్షం కురస్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తోంది.
హయత్‌నగర్ లో జడ్జి ముందుకు: సస్పెన్షన్ కు గురైన మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వర్ రావు
“రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంది. సాధారణ వర్షపాతం 6 మిల్లీమీటర్లు కాగా, సగటు వర్షపాతం 29.8 మిల్లీమీటర్లు, 397 శాతం అధికంగా నమోదైంది’’ అని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సంఘం సోమవారం బులెటిన్‌లో పేర్కొంది. కాగా రాష్ట్రంలో వరదల పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ వరుసగా రెండో రోజు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలను రక్షించేందుకు అన్ని నివారణ చర్యలు తీసుకోవాలని మంత్రులకు, ప్రజాప్రతినిధులందరికీ ముఖ్యమంత్రి సూచించినట్లు సీఎంవో అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. గత రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది, దాని ఉపనదుల వరద పరిస్థితిపై కేసీఆర్ ఆరా తీశారు. ఆలయ పట్టణం భద్రాచలం వద్ద నీటిమట్టం రెండో ప్రమాద స్థాయి 54 అడుగులకు చేరుకుంది.
ఇదిలా ఉండగా ఏపీలో కూడా మరినన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతవరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఒడిశా నుండి దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర ప్రదేశ్, పరిసర ప్రాంతాల తీరప్రాంతాల వైపుగా మరలిన అల్పపీడనం వల్ల జూలై 14 వరకు అదనపు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి నుండి భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం నివేదిక తెలిపింది.
భారీ వర్షాలు: తెలంగాణలో ఈ నెల 14 నుండి ఎంసెట్ పరీక్షలు యథాతథం, ఈసెట్ వాయిదా
అయితే ఐఎండీ ఐదు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది, దీని వల్ల ఉత్తర ఆంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో 7.6 కి.మీ ఎత్తులో సముద్ర మట్టం ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉంటుందని పేర్కొంది. ‘‘ అల్పపీడన ప్రాంతం అంతర్గత ప్రాంతాలకు, తెలంగాణ వైపు కదులుతోంది. దీని వల్ల రాబోయే నాలుగు రోజులు మరిన్ని వర్షాలు కురుస్తాయి’’ అని ఐఎండీ డైరెక్టర్ స్టెల్లా ఎస్ తెలిపారు.
రుతుపవన ద్రోణి ఇప్పుడు బికనీర్, సికార్, శివపురి, సత్నా, ఝార్సుగూడ మీదుగా వెళుతోంది, అల్పపీడన కేంద్రం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర ప్రదేశ్, పొరుగు ప్రాంతాల తీర ప్రాంతాల మీదుగా, ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉంది. సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో జూలై 11 నుంచి జూలై 14 వరకు విశాఖపట్నం, తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని డైరెక్టర్ తెలిపారు.
