దుబ్బాకలో మంచి మెజారిటీతో విజయం సాధిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.గురువారం నాడు ధరణి పోర్టల్ ను ప్రారంభించిన తర్వాత ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిందన్నారుఎన్నికల వరకు అన్ని తతంగాలు నడుస్తుంటాయని ఆయన సెటైర్లు వేశారు.తమ పార్టీకి దుబ్బాకలో అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన చెప్పారు.

దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించిన విషయమై కేసీఆర్ ఈ విషయమై తొలిసారిగా స్పందించారు. దుబ్బాకలో తమ పార్టీ గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేవని ఆయన తేల్చి చెప్పారు.

టెక్నికల్ సమస్యలు వచ్చినప్పుడు పెద్ద సమస్యగా చూడొద్దని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ధరణిి పోర్టల్ సక్సెస్ అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడ దీన్ని అమలు చేయనున్నాయని ఆయన చెప్పారు.

20 రోజుల తర్వాత వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని ఆయన చెప్పారు.. ఓపెన్ ప్లాట్లు కూడ నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.బయట వాళ్లకు తెలియకుండా హైడ్ ఆప్షన్ కూడ ఉందని ఆయన  చెప్పారు.

also read:వీఆర్ఓలను ప్రభుత్వంలో అడ్జెస్ట్ చేస్తాం: కేసీఆర్

నవంబర్ 3వ తేదీన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో నిలిచారు. బీజేపీ నుండి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుండి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు.