హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి ఘన విజయం సాధించనుందని సీఎం కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.

సోమవారం నాడు టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశంలో  సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు  జరిగే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 94 నుండి 104 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ మరింత బలహీనపడే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ రోజు రోజుకు బలహీనపడే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీకి ప్రస్తుతం ఉన్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందని కేసీఆర్ ప్రకటించారు.

also read:జాతీయ రాజకీయాల్లోకి ఇప్పుడే కాదు: తేల్చేసిన కేసీఆర్

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం ఉందని కేసీఆర్ ప్రకటించారు.

గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు 99 స్థానాలు దక్కాయి.  గత ఎన్నికల్లో వచ్చిన స్థానాల కంటే ఈ దఫా ఎక్కువ సీట్లు దక్కుతాయని సర్వే ఫలితాలు తేల్చాయని కేసీఆర్ ప్రకటించారు.