వచ్చే వారంలో బీజేపీ అభ్యర్థుల జాబితా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణపై బీజేపీ కేంద్రీకరించింది. ఈ నెల 5,6 తేదీల్లో  బీజేపీ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నట్టుగా  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు

We Will release Candidates list next week Says  Union Minister  Kishan Reddy lns

న్యూఢిల్లీ: ఈ నెల 10వ తేదీన తెలంగాణలో అమిత్ షా పర్యటిస్తారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.సోమవారంనాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  న్యూఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 5, 6 తేదీల్లో హైద్రాబాద్ లో బీజేపీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.ఈ సమావేశాల్లో  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడ పాల్గొంటారన్నారు. త్వరలో తెలంగాణలో జరిగే  అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ నేతలు దిశా నిర్ధేశం చేస్తారన్నారు.  వచ్చే  వారంలో బీజేపీ  అభ్యర్థుల  జాబితాను విడుదల చేయనున్నట్టుగా కిషన్ రెడ్డి తెలిపారు.  

పసుపు బోర్డును నిన్ననే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ నెల 3వ తేదీన   ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజమాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.  నిన్ననే మహబూబ్ నగర్  జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించిన విషయం తెలిసిందే.తెలంగాణకు గిరిజన వర్శిటీ, పసుపు బోర్డును ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణపై బీజేపీ నాయకత్వం కేంద్రీకరించింది. వచ్చే ఎన్నికల్లో  తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ  పట్టుదలగా ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నందున  బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో విస్తృతంగా పర్యటించనున్నారు.  గత నెలలో  దేశంలోని పలు రాష్ట్రాల నుండి వచ్చి బీజేపీ ప్రజా ప్రతినిధులు  రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై  నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా బీజేపీ అగ్ర నాయకత్వం  చర్యలు తీసుకుంటుంది.  మరో వైపు రాష్ట్రంలో  సునీల్ భన్సల్ నేతృత్వంలోని టీమ్  కూడ  రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసే దిశగా పలు చర్యలు తీసుకుంటుంది. గతంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో వచ్చిన ఫలితాలు బీజేపీకి సానుకూలంగా వచ్చాయి. దీంతో బీజేపీ కేంద్ర నాయకత్వం కూడ  తెలంగాణపై ఫోకస్ మరింత కేంద్రీకరించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios